విజయ్ దేవరకొండ – పరశురామ్ ప్రాజెక్ట్ లాంఛ్.. హీరోయిన్ గా మృణాల్!

యంగ్ హీరోల్లో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ( Vijay Deverakonda ) ఒకరు.

విజయ్ ఇండస్ట్రీలోకి వచ్చిన కొద్దీ సమయంలోనే భారీ ఫాలోయింగ్ ను ఏర్పరుచు కున్నాడు.

అర్జున్ రెడ్డి, గీతా గోవిందం వంటి సినిమాతో భారీ ఫాలోయింగ్ అందుకున్న విజయ్ ఆ తర్వాత భారీ లైనప్ ను సెట్ చేసుకున్నాడు.

అయితే గత రెండు సినిమాలు విజయ్ కు ప్లాప్ నే ఇచ్చాయి.ముఖ్యంగా ఎన్నో అంచనాల మధ్య పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ అయిన విజయ్ మొదటి పాన్ ఇండియన్ మూవీ ''లైగర్'' సినిమా( Liger ) అట్టర్ ప్లాప్ అయ్యింది.

ఈ సినిమా ఇచ్చిన షాక్ నుండి ఇప్పుడిప్పుడే బయట పడి విజయ్ తన నెక్స్ట్ లైనప్ ను ఇంట్రెస్టింగ్ అండ్ ఎగ్జైటింగ్ గా సెట్ చేసుకుంటున్నాడు.

ఈ క్రమంలోనే తాజాగా విజయ్ కొత్త సినిమాను లాంచ్ చేసాడు. """/" / విజయ్ కు గీతా గోవిందం వంటి ఘన విజయం అందించిన పరశురామ్ తో( Parasuram ) సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే.

మరి ఈ సినిమాను ఈ రోజు అఫిషియల్ గా గ్రాండ్ గా లాంచ్ చేసారు.

ఈ సినిమాలో విజయ్ కు జోడిగా మృణాల్ ఠాకూర్( Mrunal Thakur ) నటిస్తుంది అనే వార్తలు రెండు రోజులుగా వైరల్ అవుతుండగా అదే నిజం చేస్తూ విజయ్ - మృణాల్ జంటగా ఈ సినిమా స్టార్ట్ అయ్యింది.

"""/" / దిల్ రాజు నిర్మించనున్న ఈ సినిమా విజయ్ కెరీర్ లో 13వ సినిమాగా తెరకెక్కుతుంది.

ఈ రోజు హైదరాబాద్ లో ఈ సినిమా అట్టహాసంగా లాంచ్ అయ్యింది.ప్రముఖ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఈ సినిమాకు క్లాప్ కొట్టగా గోవర్ధన్ రావు దేవరకొండ పై ఫస్ట్ షాట్ ను డైరెక్ట్ చేసారు.

దీంతో ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు వార్తల్లో నిలుస్తుంది.గోపి సుందర్ సంగీతం అందిస్తుండగా మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

బాలయ్య డాకు మహారాజ్ సినిమాతో భారీ సక్సెస్ కొట్టడా..?