బెంగుళూరులో కుమ్మేసిన లైగర్.. ఈ క్రేజ్ ఏంటయ్యా బాబు!
TeluguStop.com
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'లైగర్'.
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మొదటిసారి పాన్ ఇండియా సినిమాలో నటిస్తుండడంతో ఈ సినిమా కోసం దేశ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎదురు చూస్తున్నారు.
ఇక మేకర్స్ సైతం వరుస ప్రమోషన్స్ చేస్తూ ఈ సినిమాపై మరింత ఆసక్తి చూపిస్తూన్నారు.
దేశ వ్యాప్తంగా ప్రెస్ మీట్లు, ఈవెంట్ లు నిర్వహిస్తూ ఈ సినిమాను జనాలకు చేరువ చేయడంలో అన్ని చేస్తున్నారు.
ఇక రౌడీ స్టార్ కు వెళ్లి ప్రతి దగ్గర గ్రాండ్ వెల్కమ్ లభిస్తుంది.
ఈయనను చూసేందుకు జనాలు భారీగా తరలి వస్తున్నారు.కొన్ని రోజుల కృత ముంబై లో ఈయన కోసం భారీ ఎత్తున అభిమానులు విచ్చేసిన సందర్భం చూసాము.
ఇక ఇప్పుడు ఈయన బెంగుళూరు లో ప్రొమోషన్స్ చేస్తున్నాడు.ఇక అక్కడ కూడా రౌడీ స్టార్ క్రేజ్ చూసి అందరు ఆశ్చర్య పోతున్నారు.
ఏ రాష్ట్రము అయినా సరే ఇదే క్రేజ్ తో ఈయన రికార్డ్ క్రియేట్ చేస్తున్నాడు.
ప్రేక్షకులు ఒక్కసారి అభిమానిస్తే ప్రాణాలు సైతం పెట్టేస్తారు అనేలా ఈయన క్రేజ్ నిరూపిస్తుంది.
"""/"/
బెంగుళూరు టూర్ లో ఈయన వెళ్లిన ప్రతి చోట సెల్ఫీలు అడగడం, ఈయనను ఫాలో చేయడం కనిపిస్తుంది.
మరి మరో మూడు రోజుల్లో రాబోతున్న ఈ సినిమా ఏ రికార్డులను క్రియేట్ చేస్తుందో అని అంతా ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
హై వోల్టేజ్ స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కుతున్న లైగర్ సినిమా ఆగష్టు 25న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది.
సోలోగా రాబోతున్న ఈ సినిమాకు ఓపెనింగ్స్ కూడా భారీగానే వచ్చే అవకాశం ఉంది.
ఇక ఈ సినిమాను పూరీ కనెక్ట్స్ ఇంకా ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించారు.
ఈ సినిమాలో లైగర్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తుంది.
వరల్డ్ ఫేమస్ బాక్సర్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను ఆగస్టు 25న పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేయనున్నారు.
షుగర్ లెవెల్స్ ను నియంత్రణలో ఉంచే బెస్ట్ అండ్ సింపుల్ వ్యాయామాలు ఇవే!