విజయ్ దేవరకొండ పాన్ ఇండియన్ హీరోగా కలలు కంటున్నాడా?
TeluguStop.com
లేట్ అయినా ఫర్వాలేదు.లేటెస్టుగా ఉండాలి.
దెబ్బ కొడితే దిమ్మ తిరిగి పోవాలి.ఒక్క దెబ్బతో లైఫ్ టర్న్ కావాలి.
హీరో ప్రభాస్ విషయంలో ఇలాగే జరిగింది.ఒక్క దెబ్బతో ప్రపంచ వ్యాప్త గుర్తింపు పొందాడు.
బాహుబలి సినిమా తన జీవితాన్నే మలుపు తిప్పింది.ఈ సినిమాతో ఫాన్ ఇండియన్ హీరోగా మారిపోయాడు.
వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం రాలేదు.ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్న సినిమాలన్నీ పాన్ ఇండియన్ మూవీస్ గానే తెరకెక్కుతున్నాయి.
సాహో, రాధేశ్యామ్, సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కే సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నాడు.
ఈ సినిమాలన్నీ అన్ని భాషల్లో రిలీజ్ అయ్యేలా ప్లాన్ వేస్తున్నారు.ప్రభాస్ బాటలోనే పయనిస్తున్నాడు మరో హీరో విజయ్ దేవరకొండ.
ఈయన కూడా పలు పాన్ ఇండియన్ మూవీస్ లో నటిస్తున్నాడు.పూరీ, దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న లైగర్ మూవీ రిలీజ్ కాకముందే ఆయన ఫుల్ బిజీ అయ్యాడు.
అంతేకాదు.టాలీవుడ్ దర్శకులకు అందనంత దూరం వెళ్లిపోతున్నట్లు తెలుస్తోంది.
తాజాగా ఓ తెలుగు దర్శకుడు తన దగ్గర కథ ఉంది.వింటారా? అని విజయ్ ని అడిగాడట.
అయితే ఈ సినిమా కథ పాన్ ఇండియన్ మూవీకి సరిపోతుందా? అని అడిగాడట.
దీంతో విజయ్ రేంజ్ పెరిగింది.ఆయన తెలుగు సినిమాలు చేయడం కష్టం అని భావిస్తున్నారట చాలా మంది దర్శక నిర్మాతలు.
"""/"/
ప్రస్తుతం పూరీ జగన్నాథ్ తో కలిసి విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ అనే పాన్ ఇండియన్ మూవీ తెరకెక్కుతుంది.
కరోనా మూలంగా ఈ సినిమా విడుదల వాయిదా పడింది.ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయ్యాయి.
ఈ సినిమా రిలీజ్ కాకముందే విజయ్ దేవరకొండ పాన్ ఇండియన్ హీరోగా ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడు.
అటు ఇకపై తాను అదే రేంజ్ సినిమా కథలు వినేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.
వారం రోజుల్లో 2 డబుల్ సెంచరీలు.. టీమిండియా సెలక్షన్ కమిటీకి సంకేతాలు ఇస్తున్నాడుగా?