అయ్యబాబోయ్.. చివరకి రౌడీ స్టార్ కూడా ఫాలో అవుతున్నాడా?

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘ఫైటర్’ అనే సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాను క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డైరక్ట్ చేస్తోండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

ఇక ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా దర్శకుడు పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతుండటంతో ఇందులో విజయ్ దేవరకొండ ఎలాంటి పాత్రలో కనిపిస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది.

ఇక ఈ సినిమాను అల్ట్రా స్టైలిష్‌గా పూరీ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాను బాలీవుడ్‌లో స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ రిలీజ్ చేసేందుకు ముందుకు వచ్చాడు.

కాగా ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే హీరోయిన్‌గా నటిస్తోంది.కాగా బాలీవుడ్ ప్రేక్షకులను ఈ సినిమాతో మెప్పించేందుకు విజయ్ దేవరకొండ సరికొత్త లుక్‌లో కనిపించేందుకు రెడీ అవుతున్నాడు.

ఈ క్రమంలో ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఏకంగా సిక్స్ ప్యాక్ లుక్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటివరకు విజయ్ దేవరకొండ సిక్స్ ప్యాక్ లుక్‌లో కనిపించలేదు.దీంతో ఫైటర్ సినిమాలో రౌడీ స్టార్ ఎలాంటి బాడీతో మనకు కనిపిస్తాడో అని అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

పూరీ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తూనే ఛార్మీతో కలిసి ప్రొడ్యూస్ చేస్తున్నాడు.ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ కొట్టేందుకు విజయ్ దేవరకొండతో పాటు పూరీ రెడీ అవుతున్నారు.

ఈ సినిమా షూటింగ్‌ను తిరిగి ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.ఇటీవల విజయ్ దేవరకొండ వరుస ఫ్లాప్‌లతో సతమతమవుతుండటంతో, ఈసారి అదిరిపోయే హిట్ అందుకునేందుకు ఆయన తీవ్ర కష్టపడుతున్నాడు.

మరి ఫైటర్ సినిమాతో విజయ్ దేవరకొండ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

కేసీఆర్ పాలన కావాలంటే బీఆర్ఎస్ గెలవాలి..: కేటీఆర్