ఇండియాని షేక్ చేయడానికి ముంబై వెళ్లా.. విజయ్ కామెంట్స్ వైరల్?

పెళ్లిచూపులు సినిమాతో తెలుగు తెరకు పరిచయమై అనంతరం ఇండస్ట్రీలో ఒక్కో మెట్టు ఎక్కుతూ.

ఇండస్ట్రీలో అగ్ర హీరోగా పేరు సంపాదించుకున్నారు నటుడు విజయ్ దేవరకొండ.ఇలా ఇండస్ట్రీలో అంచలంచలుగా ఎదుగుతూ నేడు పాన్ ఇండియా స్థాయిలో సినిమాలను చేయడానికి సిద్ధమయ్యారు.

ఈ క్రమంలోనే మొదటిసారిగా ఈయన పాన్ ఇండియా స్థాయిలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లైగర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఇక ఈ సినిమా ఆగస్టు 25వ తేదీ విడుదల కావడంతో ఈ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకను వరంగల్ లో ఎంతో ఘనంగా నిర్వహించారు.

ఇకపోతే ఈ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకలో భాగంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఈ సినిమా ప్రమోషన్ కోసం ఎన్నో రాష్ట్రాలలో తిరిగిన మనసంతా ఇక్కడే ఉందని అందుకే ముందుగా ఇక్కడ ఫ్రీ రిలీజ్ వేడుక పెట్టామని తెలిపారు.

ఇకపోతే ఈ సినిమా స్టోరీ లైన్ చెబుతూ.లైగర్‌`లో ఓ సరూర్‌ నగర్‌ పొరగాడు, వాళ్లమ్మ కలిసి ముంబయి వెళ్తారు.

ఇలా ఇండియాని షేక్ చేద్దామని ముంబై వెళ్లిన ఆ తల్లి తన కొడుకును ఛాంపియన్ చేయాలని అనుకుంటుంది.

మేము కూడా అంతే, మా లైఫ్ కూడా అంతే అంటూ ఈ సందర్భంగా ఈయన షాకింగ్ కామెంట్స్ చేశారు.

"""/" / ఇకపోతే బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ బాక్సర్ గా సందడి చేయనున్నారు.

ఇక ఈయన తల్లి పాత్రలో రమ్యకృష్ణ ఎంతో అద్భుతంగా నటించారని తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది.

ఇక ఈ సినిమాలో ప్రముఖ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానున్నారు.

ఇక ఈ సినిమా ఆగస్టు 25వ తేదీ విడుదల కావడంతో పెద్ద ఎత్తున ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.