బిగ్ బాస్ 9 కోసం షాకింగ్ కండిషన్లు పెట్టిన విజయ్ దేవరకొండ… రెమ్యూనరేషన్ ఎంతంటే?
TeluguStop.com
బిగ్ బాస్ ( Bigg Boss )కార్యక్రమం తెలుగులో ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుని ఇప్పటికే ఈ కార్యక్రమం తెలుగులో ఎనిమిది సీజన్లు పూర్తిచేసుకుని తొమ్మిదవ సీజన్ ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే ఈ సీజన్ కి సంబంధించిన ఏర్పాట్లను మేకర్స్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.అయితే గత కొద్ది రోజులుగా బిగ్ బాస్ హోస్ట్ మారబోతున్నారు అంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.
సీజన్ 3 నుంచి నాగార్జున( Nagarjuna ) హోస్ట్ గా వ్యవహరించారు.అయితే సీజన్ 9 కార్యక్రమానికి నాగార్జున తప్పుకోవడంతో విజయ్ దేవరకొండ ( Vijay Devarakonda ) ఈ కార్యక్రమానికి హోస్టుగా వ్యవహరించబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి.
ఇప్పటికే నిర్వాహకులు విజయ్ దేవరకొండను కలిసి అన్ని విషయాల గురించి చర్చించినట్టు తెలుస్తుంది అయితే విజయ్ దేవరకొండ ఈ షోకి హోస్టుగా వ్యవహరించాలి అంటే కొన్ని కండిషన్లు కూడా పెట్టినట్టు తెలుస్తుంది.
"""/" /
ఈ కార్యక్రమానికి విజయ్ దేవరకొండ హోస్ట్గా వ్యవహరించాలి అంటే తనపై ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉండేలా చూసుకోవాలని చెప్పారట ముఖ్యంగా కంటెస్టెంట్ల టాలెంట్ వారి ఆట తీరును బట్టి తాను హోస్ట్ చేస్తానే తప్ప ఫలానా కంటెస్టెంట్ ను మాత్రమే ఎంకరేజ్ చేస్తూ హోస్ట్ చేయాలి అంటూ తనపై ఒత్తిడి తీసుకురాకూడదని, కంటెస్టెంట్ల టాలెంట్ ప్రకారమే తాను వ్యవహరిస్తానని కండిషన్ పెట్టారట.
అంతేకకుండా ఈ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరించడం కోసం 15 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ( Remuneration )డిమాండ్ చేసినప్పటికీ మేకర్స్ ఈయన కండిషన్లకు ఒప్పుకున్నారని తెలుస్తోంది.
మరి విజయ్ దేవరకొండకు సంబంధించి వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.
"""/" /
ఇప్పటివరకు ఈ కార్యక్రమానికి హోస్టుగా తాను తప్పుకుంటున్నాను అంటూ నాగార్జున ఎక్కడ కూడా అధికారికంగా ప్రకటించలేదు.
అదేవిధంగా ఈ విషయంపై విజయ్ దేవరకొండ కానీ బిగ్ బాస్ నిర్వాహకులు కానీ ఎక్కడ ప్రకటించకపోవడం గమనార్హం.