వారిద్దరి కోసమే కల్కి సినిమాలో నటించాను.. డైరెక్టర్ కి నేను లక్కీ కాదు: విజయ్ దేవరకొండ
TeluguStop.com
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోగా ప్రస్తుతం వరుస సినిమాలకు కమిట్ అవుతూ ఎంతో బిజీగా ఉన్నటువంటి వారిలో నటుడు విజయ్ దేవరకొండ ( Vijay Devarakonda ) ఒకరు.
ఇటీవల ఫ్యామిలీ స్టార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయారు.
ఇకపోతే ఇటీవల ప్రభాస్ ( Prabhas ) హీరోగా నటించిన పాన్ ఇండియన్ చిత్రం కల్కి( Kalki ) .
ఈ సినిమా జూన్ 27వ తేదీ విడుదల అయ్యి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.
ఇక ఈ సినిమాలో ఎంతోమంది సెలబ్రిటీలు కూడా భాగమయ్యారు. """/" /
ఇక కల్కి సినిమాలో అర్జునుడి పాత్రలో నటించారు నటుడు విజయ్ దేవరకొండ.
చివరి వరకు ఈయన పాత్ర గురించి చెప్పకుండా సినిమా కొన్ని గంటల విడుదలకు ముందు ఇందులో విజయ్ దేవరకొండ కూడా నటించారనే విషయాన్ని మేకర్స్ వెల్లడించారు.
ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో విజయ్ దేవరకొండ గురించి సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ గా మారింది.
డైరెక్టర్ నాగ్ అశ్విన్ ( Nag Aswin ) కి విజయ్ దేవరకొండ లక్కీ చార్మ్ గా మారిపోయారు అందుకే తన ప్రతి సినిమాలో విజయ్ దేవరకొండను తీసుకుంటున్నారంటూ వార్తలు వచ్చాయి.
"""/" /
ఇక ఈ విషయం గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయనని మీడియా రిపోర్టర్ ప్రశ్నించారు.
మీరు డైరెక్టర్ నాగ్ అశ్విన్ కి లక్కీగా మారిపోయారని అందుకే ప్రతి సినిమాలో మీకు ఒక పాత్ర క్రియేట్ చేస్తున్నారు నిజమేనా అంటూ ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు విజయ సమాధానం చెబుతూ నేను డైరెక్టర్ కి లక్కీ కాదు.
ఈ సినిమాని నేను ప్రభాస్ అన్న కోసం అలాగే డైరెక్టర్ నాగ్ అశ్విన్ కోసం మాత్రమే చేశానని తెలిపారు.
కల్కి సినిమా చాలా అద్భుతంగా ఉంది అందుకే సక్సెస్ అయింది ఇక్కడ మనం చేసింది ఏమీ లేదు అంటూ ఈయన సమాధానం చెప్పారు.
ఒకరోజు షూటింగ్ కి రమ్మని నాగి కోరారు.ఇందులో తాను అర్జునుడి పాత్రలో నటించానే తప్ప నాకు ఎలాంటి పోటీ లేదు అంటూ విజయ్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ ప్రక్షాళన .. ఆమెనూ తప్పిస్తున్నారా ?