వైజాగ్ బీచ్ లో రొమాంటిక్ సాంగ్ చేయబోతున్న విజయ్-సమంత!

విజయ్ దేవరకొండ.ఈ పేరు మన టాలీవుడ్ లో ఎంత సెన్సేషన్ నో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఇతడు చేసింది కొన్ని సినిమాలు అయినా కూడా ఈయన ఫాలోయింగ్ మాత్రం ఏ యంగ్ హీరోకు లేనంత ఫాలోయింగ్ ఉంది.

విజయ్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నటించిన లైగర్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీగా ఉంది.

ఈ సినిమా తర్వాత మరొక రెండు పాన్ ఇండియా సినిమాలు లైన్లో పెట్టాడు.

లైగర్ తర్వాత కూడా విజయ్ పూరీ దర్శకత్వంలోనే జనగణమన సినిమా ప్రకటించాడు.ఈ సినిమా ప్రకటించి ఆ తర్వాత శివ నిర్వాణ దర్శకత్వంలో మరొక సినిమా ప్రకటించాడు.

ఈ రెండు సినిమాల్లో ముందుగా శివ సినిమాను స్టార్ట్ చేసి షూటింగ్ కూడా వేగంగా పూర్తి చేస్తున్నాడు.

"""/" / ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి భారీ అంచనాలు నెలకొన్నాయి.ఎందుకంటే ఈ సినిమాలో విజయ్ కి జోడీగా సమంత నటించనుంది.

అందుకే అంచనాలు భారీగా పెరిగాయి.మొదటిసారి కొత్త జోడీ కావడంతో తెరపై ఫ్రెష్ ఫీలింగ్ కలుగుతుంది.

ఈ సినిమా కాశ్మీర్ నేపథ్యంలో సాగే అందమైన ప్రేమ కథ అని తెలుస్తుంది.

ఈ సినిమా ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. """/" / కాశ్మీర్ లో ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుని హైదరాబాద్ లో రెండవ షెడ్యూల్ ను ఫినిష్ చేసారు.

ఇక ఇప్పుడు టీమ్ అంతా వైజాగ్ వెళ్ళబోతున్నట్టు తెలుస్తుంది.వైజాగ్ బీచ్ లో విజయ్, సమంత మధ్య ఒక రొమాంటిక్ సాంగ్ ను షూట్ చేయబోతున్నారట.

మరి బీచ్ లాంటి అందమైన లొకేషన్స్ లో ఈ సాంగ్ ను ఎంత అందంగా తెరకెక్కిస్తారో చూడాలి.

ఇక మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు హీషమ్ సంగీతం అందిస్తున్నారు.

మరి ఈ లవ్ స్టోరీ ఈ జోడీకి ఎలాంటి హిట్ అందిస్తుందో వేచి చూడాల్సిందే.

Vegetables : కూర‌గాయ‌లు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలా.. అయితే ఈ టిప్స్ త‌ప్ప‌క తెలుసుకోండి!