Vijay Devarakonda : ఆ పిల్ల నాకొద్దు బాబోయ్… చేతులెత్తి దండం పెట్టిన విజయ్ దేవరకొండ?

తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఏ విధమైనటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా కేవలం తన టాలెంట్ తో ఇండస్ట్రీలోకి వచ్చి కెరీర్ మొదట్లో పలు సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించి అనంతరం పాన్ ఇండియా రేంజ్ కు ఎదిగినటువంటి వారిలో నటుడు విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) ఒకరు.

పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నటువంటి ఈయన అనంతరం పెళ్లిచూపులు సినిమాలో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ సినిమాలో స్మార్ట్ లుక్ తో అందరిని ఆకట్టుకున్నటువంటి విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ సినిమా ద్వారా తనలో మరో యాంగిల్ ప్రేక్షకులకు పరిచయం చేశారు.

అర్జున్ రెడ్డి సినిమాలో మాస్ డైలాగ్స్ పేలుస్తూ బోల్డ్ సీన్స్ ద్వారా అందరిని ఆకట్టుకున్నటువంటి విజయ్ దేవరకొండ తన సినిమాల ప్రమోషన్ల సమయంలో పెద్ద ఎత్తున యాటిట్యూడ్ చూపిస్తూ ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు ఇలా ఈ సినిమా కూడా మంచి సక్సెస్ కావడంతో ఈయన క్రేజ్ మారిపోయింది అని చెప్పాలి.

అప్పటినుంచి తన సినిమాలను విభిన్న రీతిలో ప్రమోట్ చేయడమే కాకుండా చాలా స్టైలిస్ట్ లుక్ లో ఈయన కనిపిస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేశారు.

దీనితో ఈయనకు ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.

ఇక విజయ్ దేవరకొండకు ఉన్నటువంటి క్రేజ్ దృష్టిలో పెట్టుకొని డైరెక్టర్ పూరి జగన్నాథ్( Director Puri Jagannath ) ఈయనకు లైగర్ అనే సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాన్ని కల్పించారు.

ఈ సినిమాపై ఎన్నో అంచనాలు కూడా పెరిగిపోయాయి.ఇక ఈ సినిమా ద్వారా ఈయన క్రేజ్ అమాంతం పెరిగిపోతుందని అందరూ భావించారు.

అయితే ఈ సినిమా ప్రమోషన్ల సమయంలో విజయ్ దేవరకొండ కూడా తనదైన స్టైల్ లో యాటిట్యూడ్ చూపిస్తూ పెద్ద ఎత్తున ప్రమోషన్స్ నిర్వహించారు అయితే ఇదే ఈయనకు రివర్స్ అయింది అని చెప్పాలి ఇలా యాటిట్యూడ్ చూపించడంతో ఎంతోమంది ఈయన పట్ల విమర్శలు కూడా కురిపించారు.

అయితే ఈ సినిమా కూడా డిజాస్టర్ గా నిలవడంతో విజయ్ కెరియర్ ఒక్కసారిగా ఇబ్బందులలో పడినట్టు అయింది.

"""/" / ఇక ఈ సినిమా తర్వాత ఈయన ఖుషి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా మంచి సక్సెస్ అందుకోవడంతో ఈయన తన ఆటిట్యూడ్ కూడా తగ్గించి సినిమాల ఎంపిక విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకుంటున్నారని చెప్పాలి.

ప్రస్తుతం ఈయన గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నారు ఈ సినిమా తర్వాత పరుశురాం డైరెక్షన్లో మరొక సినిమా కూడా చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇక గౌతమ్ సినిమాలో ఈయన సరసన శ్రీ లీల ( Sreeleela ) నటించగా పరశురాం దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో మృణాల్ ( Mrunal ) నటించారు అయితే ఈ సినిమాలో మొదటి ఛాయిస్ ఈమె కాదని తెలుస్తోంది.

"""/" / ఈ సినిమాలో మొదటగా మేకర్స్ పూజా హెగ్డే ( Pooja Hedge )ని ఎంపిక చేశారట.

అయితే పూజా హెగ్డే ఎక్కువ ఈ మధ్యకాలంలో చాలా బాడ్ టైం నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఈమెను కాదనుకొని తిరిగి నటి సాయి పల్లవి ( Sai Pallavi ) పేరును ప్రస్తావనపు తీసుకువచ్చారు.

ఈ సినిమాలో సాయి పల్లవి అయితే బాగుంటుందని మేకర్ చెప్పడంతో ఒక్కసారిగా విజయ్ దేవరకొండ షాక్ అవుతూ ఆ పిల్లకు ఓ దండం రా బాబు దయచేసి ఆమెను ఈ సినిమాలో తీసుకోకండి అంటూ దర్శక నిర్మాతలకు చెప్పారట.

నా బాడీ లాంగ్వేజ్ కి ఆమెకి .నేను చూస్ చేసుకునే స్టోరీస్ కి ఆమెకి అసలు మ్యాచ్ అవ్వదు.

వద్దనంటే వద్దు అంటూ మరో హోంలీ లేడీని చూస్ చేసుకోమంటూ ఆప్షన్ ఇచ్చారట.

ఇలా విజయ్ దేవరకొండ దర్శకనిర్మాతలకు మరొక ఆప్షన్ ఇవ్వడంతో ఈ సినిమాలో నటించడం కోసం మేకర్స్ చివరికి మృణాల్ ను ఎంపిక చేశారని తెలుస్తోంది.

విద్యార్థులకు వింత రూల్ పెట్టిన కాలిఫోర్నియా టీచర్..