'లైగర్‌' టాక్‌ కి వసూళ్లకి సంబంధమే లేదు.. రౌడీ స్టార్‌ గట్టిగానే కొట్టాడు

విజయ్‌ దేవరకొండ లైగర్ సినిమా కు నెగటివ్‌ టాక్ వచ్చింది.సినిమా విడుదల అయిన వెంటనే సోషల్‌ మీడియా లో ఆ టాక్ మొదలు అవ్వడంతో అభిమానులు కూడా సినిమా ను చూసేందుకు థియేటర్ కు వెళ్తారో లేదో అనే అనుమానం వ్యక్తం అయ్యింది.

కానీ మొదటి రోజు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా మంచి వసూళ్లను లైగర్ రాబట్టింది.

నెగటివ్ టాక్ వచ్చిన సినిమా లకు అయిదు ఆరు కోట్ల షేర్‌ రావడం పెద్ద విషయం.

అలాంటిది ఈ సినిమా కు ఏకంగా ప్రపంచ వ్యాప్తంగా కలిపి రూ.13.

35 కోట్ల షేర్‌ లభించింది.రూ.

24.5 కోట్ల గ్రాస్ వసూళ్ల ను రాబట్టిన ఈ సినిమా నిజంగా గ్రేట్‌ అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

రౌడీ స్టార్ కి ఉన్న ఇమేజ్ వల్లే ఇది సాధ్యం అయ్యింది.ఇలా కేవలం మహేష్ బాబు మరియు పవన్ కళ్యాణ్ లు మాత్రమే రాబట్టగలరు అంటూ నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

రౌడీ స్టార్‌ సినిమా అంటే మినిమం కంటెంట్ ఉంటుంది అనే ఉద్దేశ్యంతో అభిమానులు నెగటివ్ టాక్‌ వచ్చినా కూడా థియేటర్ల వద్ద క్యూ కట్టారు.

అదే పరిస్థితి రాబోయే మూడు రోజుల్లో కూడా ఉంటే కనీసం 50 కోట్ల వరకు అయినా వసూళ్లు లాంగ్‌ రన్ లో నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు బాక్సాఫీస్‌ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సినిమా ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా 90 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన విషయం తెల్సిందే.

సినిమా యొక్క వసూళ్లు ప్రస్తుతం సోషల్‌ మీడియా లో హాట్ టాపిక్ గా ఉంది.

సినిమా నైజాం ఏరియాలో 4.20 కోట్ల షేర్ ను రాబట్టి వావ్‌ అనిపించింది.

ఇక ఆంద్ర మరియు సీడెడ్‌ కలిపి 5.35 కోట్ల షేర్ ను రాబట్టింది.

యూఎస్ఏ లో 1.8 కోట్ల షేర్‌ ను రాబట్టి సాలిడ్‌ ఓపెనింగ్స్ ను రాబట్టింది.

ఉత్తర భారతంలో రెండు కోట్ల వరకు షేర్ ను రాబట్టింది.ఉత్తర భారతంలో భారీ ఎత్తున ప్రమోషన్ చేసినా కూడా పెద్ద గా ప్రయోజనం లేదు.

పుష్ప 2 సుకుమార్ కి ఏ రేంజ్ లో హిట్ ఇవ్వబోతుంది…