త్రిభాషా చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రౌడీ హీరో! కీలక పాత్రలో నయనతార!

టాలీవుడ్ లో క్రేజీ హీరో గా వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్న యువ హీరో విజయ్ దేవరకొండ.

ఇప్పటికే కెరియర్ లో నాలుగురు బ్లాక్ బస్టర్ హిట్స్ తో జోరు మీద వున్న విజయ్ ప్రస్తుతం డియర్ కామ్రేడ్ అనే సినిమా షూటింగ్ తో బిజీగా వున్నాడు.

ఇక ఈ సినిమా తర్వాత విజయ్ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో సినిమా షూటింగ్ స్టార్ట్ చేసే అవకాశాలు వున్నాయి.

ఇవే కాకుండా విజయ్ మరో అర డజను చిత్రాల వరకు కమిట్ అయ్యి వున్నట్లు తెలుస్తుంది.

విజయ్ నోటాతో సినిమాతో కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఆ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు.

అయిన కూడా విజయ్ దేవరకొండ మళ్ళీ మరో దర్శకుడుతో ఈ సారి తెలుగు, తమిళ, మలయాళీ భాషలలో తెరకెక్కే సినిమా కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.

ఈ సినిమాని తమిళ దర్శకుడు ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో తెరకెక్కుతుంది అని తెలుస్తుంది.

ఇక ఈ సినిమా సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార ఓ కీలక పాత్రలో నటిస్తుంది అనే టాక్ వినిపిస్తుంది.

మరి ఈ వార్తలలో నిజమెంత అనేది వేచి చూడాలి.

అక్కడ ఫ్రీ ఎమర్జెన్సీ కేర్ సెంటర్ ప్రారంభించిన ఉపాసన.. ఎంతో సంతోషంగా ఉందంటూ?