ఈసారి తమ్ముడి కోసం అన్న రాలేదు.. రౌడీ ఫ్యాన్స్ అసంతృప్తి
TeluguStop.com
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) తమ్ముడు ఆనంద్ దేవరకొండ ( Anand Devarakonda )నటించిన బేబీ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను చాలా విభిన్నంగా ప్లాన్ చేశారు.టీజర్ విడుదల అయింది మొదలుకుని నిన్నటి వరకు యూనిట్ సభ్యులు కాళ్లకు చక్రాలు కట్టుకుని తిరిగినట్లుగా ప్రమోషన్ కార్యక్రమాలు చేశారు.
ఆనంద్ దేవరకొండ స్వయంగా ఆటో నడుపుకుంటూ సిటీ లో చాలా రద్దీ ఏరియాలు తిరుగుతూ బేబీ సినిమా గురించి ప్రచారం చేయడం జరిగింది.
"""/" / సోషల్ మీడియా లో కూడా బేబీ గురించి ప్రధానంగా చర్చ జరిగింది.
అలా బేబీ సినిమా కి మంచి బజ్ క్రియేట్ అయింది అనడంలో సందేహం లేదు.
హీరోయిన్ గా ఈ సినిమా లో వైష్ణవి( Vaishnavi ) నటించిన విషయం తెల్సిందే.
ఈ సినిమా ప్రమోషన్ కోసంఆనంద్ దేవరకొండ.వైష్ణవి మాత్రమే ప్రమోషన్ లో పాల్గొన్నారు.
ఆనంద్ దేవరకొండ కోసం విజయ్ దేవరకొండ తప్పకుండా ప్రమోషన్ కార్యక్రమాలకు హాజరు అవుతాడు అంటూ అంతా భావించారు.
కానీ విజయ్ దేవరకొండ మాత్రం ఆసక్తి చూపించలేదు. """/" / బేబీ సినిమా( Baby Cinema ) ప్రమోషన్ కోసం ఎక్కడ కూడా విజయ్ దేవరకొండ కనిపించలేదు.
సోషల్ మీడియా లో కూడా పెద్దగా సందడి చేయలేదు.ఒక వేళ విజయ్ దేవరకొండ చిన్న ట్వీట్ చేసినా లేదంటే ఒక ఈవెంట్ లో పాల్గొన్నా కూడా కచ్చితంగా బేబీ స్థాయి అమాంతం పెరిగి ఉండేది అనడంలో సందేహం లేదు.
విజయ్ దేవరకొండ బేబీ సినిమా ప్రమోషన్ లో కనిపించకున్నా కూడా రావాల్సిన బజ్ వచ్చింది.
మంచి అడ్వాన్స్ బుకింగ్ అయితే జరిగింది.ఇక సినిమా ఫలితాన్ని బట్టి కలెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఓపెనింగ్స్ భారీగా వచ్చినా కూడా ఆనంద్ దేవరకొండ కోసం విజయ్ దేవరకొండ వచ్చి ఉంటే బాగుండేది అంటూ రౌడీ ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తల్లి పక్కన ఉండగానే చిన్నారిపై కుక్కల దాడి..