హలో దేవరకొండ.. నువ్వు మరీ ఎక్కువ చేస్తున్నావ్!!
TeluguStop.com
ఒకటి రెండు సక్సెస్‌లు రాగానే ఏ హీరో అయినా కూడా నిర్మాతల నుండి గొంతెమ్మ కోర్కెలను కోరుతూ ఉంటాడు.
అందరిలాగే తాను కూడా అని నిరూపించుకున్నాడు విజయ్ దేవరకొండ.కేవలం రెండు సినిమాలతో సూపర్ స్టార్ అంటూ పిలిపించుకుంటున్న విజయ్ దేవరకొండ త్వరలో ‘నోటా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
అక్టోబర్ 5వ తారీకున విడుదల కాబోతున్న ‘నోటా’ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.
అంచనాలకు తగ్గట్లుగా ఈ చిత్రం ఉంటుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది.మరో వైపు విజయ్ దేవరకొండ చేస్తున్న, చేయబోతున్న సినిమాల జాబితా చాంతాడంత ఉంది.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
‘నోటా’ విడుదల కాగానే ‘డియర్ కామ్రేడ్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
ఆ చిత్రం తర్వాత మైత్రి మూవీస్ బ్యానర్‌లో విజయ్ ఒక సినిమాను చేయబోతున్నాడు.
మైత్రి మూవీస్ బ్యానర్‌లో మూవీ కోసం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది.
త్వరలోనే సినిమాను పట్టాలెక్కించే అవకాశం ఉంది.అయితే ఆ సినిమాలో హీరోయిన్‌గా జాన్వీ కపూర్‌ను ఎంపిక చేయాల్సిందిగా నిర్మాతలకు విజయ్ దేవరకొండ సూచించాడట.
దాంతో ప్రస్తుతం మైత్రి మూవీస్ నిర్మాతలు బాలీవుడ్ బాట పట్టారు.జాన్వీ కపూర్‌ను భారీ పారితోషికం ఇచ్చి మరీ ఒప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
శ్రీదేవి కూతురు అయిన జాన్వీ కపూర్ ‘ధడక్’ చిత్రంతో హిందీ ప్రేక్షకులకు పరిచయం అయ్యింది.
మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుని, తల్లికి తగ్గ కూతురు అనిపించుకోవడంతో పాటు, అద్బుతమైన నటనతో అరించింది.
ప్రస్తుతం హిందీలో రెండు సినిమాలు చేస్తున్న ఈఅమ్మడు సౌత్‌లో మంచి ఛాన్స్ దక్కితే చేసేందుకు రెడీ అంటూ ప్రకటించిన విషయం తెల్సిందే.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
ఈ నేపథ్యంలో మైత్రి మూవీస్ వారు ఆమె కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు.
మరో వైపు విజయ్ దేవరకొండకు అప్పుడే జాన్వీ కపూర్ కావాల్సి వచ్చిందా అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
విజయ్ దేవరకొండ సక్సెస్ పొగరు తలకెక్కకుండా జాగ్రత్తగా ఉండాలని, ఇలాంటి గొంతెమ్మ కోర్కెలు కోరితే మాత్రం కెరీర్ వెంటనే ముగిసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
విజయ్ దేవరకొండ, జాన్వీని కోరిన వార్తల్లో ఎంత నిజం ఉందో కాలమే క్లారిటీ ఇవ్వాలి.
స్పెషల్ ట్రిక్‌తో ఫిమేల్ ఐఏఎస్ ఆఫీసర్లను ప్రేమలో పడేసిన యువకుడు.. లాస్ట్ ట్విస్ట్..?