పెళ్లి తర్వాత కూడా అలాగే ఉండాలి… విజయ్ దేవరకొండ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

రౌడీ హీరో విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) సమంత ( Samantha ) ప్రస్తుతం ఖుషి( Khushi ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందు రావడానికి సిద్ధమయ్యారు.

ఈ సినిమా తాజాగా షూటింగ్ పనులను పూర్తి చేసుకున్నారు.ఇకపోతే ఈ సినిమా సెప్టెంబర్ ఒకటవ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు.

ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈ సినిమా నుంచి ఆరాధ్య అనే లిరికల్ సాంగ్ విడుదల చేశారు.

ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అయితే తాజాగా ఈ పాట గురించి విజయ్ దేవరకొండ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి .

"""/" / ఈ సందర్భంగా విజయ్ ఈ పాట గురించి మాట్లాడుతూ నాకు ఈ సినిమాలో ఇష్టమైనటువంటి పాటలలో ఆరాధ్య పాట ఒకటి అని తెలిపారు.

ఈ పాటలో పెళ్లి చేసుకున్న తర్వాత ఏడాది పాటు దంపతులు ఎలా ఉంటారో ఇందులో చాలా అద్భుతంగా చూపించారు.

అయితే నేను ఇంకా పెళ్లి చేసుకోలేదు కానీ భవిష్యత్తులో పెళ్లి చేసుకుంటే నా లైఫ్ కూడా ఈ పాటలో ఉన్న విధంగానే ఉండాలని కోరుకుంటున్నాను అంటూ విజయ్ దేవరకొండ పెళ్లి( Marriage ) గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

"""/" / ఇక విజయ్ దేవరకొండ రష్మిక మధ్య ఏదో రిలేషన్ ఉందంటూ గత కొంతకాలంగా వీరిద్దరి గురించిఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇలా వీరిద్దరూ పలు సందర్భాలలో కలిసి కనిపించడంతో వీరి మధ్య ఏదో ఉందంటూ వార్తలు హల్ చల్ చేశాయి అయితే మీరు మాత్రం మేమిద్దరం మంచి స్నేహితులు అంటూ చెప్పుకొస్తున్నారు .

ఇక విజయ్ దేవరకొండ ఖుషి సినిమా షూటింగ్ పనులు పూర్తి చేసుకోవడంతో ఈయన తన తదుపరి సినిమా షూటింగ్ పనులలో బిజీ అయ్యారు.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రాబోతున్న సినిమా షూటింగ్ పనులలో బిజీ కానున్నారు.

ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు.

మహిళలు ఇంట్లోనే ఉండాలి.. బీజేపీ, ఆర్ఎస్ఎస్‌ ఆలోచనే ఇదే : ఎన్ఆర్ఐలతో రాహుల్