లైగర్ ఎప్పుడు వస్తుంది..?

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా లైగర్.

పూరీ కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమా పాన్న్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేశారు.

సినిమాలో బాలీవుడ్ భామ అనన్యా పాండే హీరోయిన్ గా నటిస్తుంది.సెకండ్ వేవ్ కు ముందు షూటింగ్ కు బ్రేక్ ఇచ్చిన లైగర్ సెకండ్ వేవ్ తర్వాత శరవేగంగా షూటింగ్ జరుపుకుంది.

ఈ క్రమంలో సెప్టెంబర్ 9న వినాయక చవితి కానుకగా లైగర్ సినిమా రిలీజ్ చేయాలని అనుకున్నారు.

కాని అది వాయిదా పడ్డది.ఇక ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అన్నది క్లారిటీ రాలేదు.

తెలుగులో వరుసగా సినిమాలు రిలీజ్ అవుతున్నా లైగర్ పాన్ ఇండియా రిలీజ్ కాబట్టి నార్త్ సైడ్ కూడా అన్ని థియేటర్లు ఓపెన్ అయ్యాక రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

మహారాష్ట్రలో అక్టోబర్ 22 నుండి థియేటర్లు తెరచుకుంటాయని తెలుస్తుంది.సో లైగర్ సినిమా నవంబర్, డిసెంబర్ నెలల్లో రిలీజ్ అయ్యే ఛాన్సులు ఉన్నాయని తెలుస్తుంది.

లైగర్ సినిమా విజయ్ దేవరకొండ ఇమేజ్ కు తగినట్టుగా ఉంటుందని తెలుస్తుంది.సినిమా ఖచ్చితంగా పాన్ ఇండియా ఫ్యాన్స్ మెప్పించేలా ఉంటుందని అంటున్నారు.

ఈ సింపుల్ చిట్కాల‌తో డార్క్ నెక్‌కు చెప్పేయండి గుడ్ బై!