ట్రైలర్ పబ్లిక్ టాక్... 'లైగర్' వాళ్లకు ఎక్కేనా?
TeluguStop.com
విజయ్ దేవరకొండ మోస్ట్ వెయిటెడ్ క్రేజీ మూవీ లైగర్ విడుదలకు సిద్ధం అయ్యింది.
వచ్చే నెల చివరి వారం లో విడుదల కాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.
భారీ ఎత్తున మీడియా సమావేశం ఏర్పాటు చేసి.హైదరాబాద్ లో హంగామా చేస్తూ లైగర్ బుడ్డ రీల్ ను వదిలారు.
హీర గా విజయ్ దేవరకొండకు ఈ సినిమా నిలిచి పోయే సినిమా అవ్వడం ఖాయం అనిపిస్తుంది.
హీరోయిన్ గా అనన్య పాండే ఈ సినిమా తో తెలుగు లో ఎంట్రీ ఇవ్వబోతుంది.
పాన్ ఇండియా సినిమా గా ఈ సినిమా రాబోతుంది.రమ్యకృష్ణ ఈ సినిమా లో కీలక పాత్ర లో కనిపించబోతుంది.
ఇక పూరి సినిమా ల్లో ఎప్పుడూ కనిపించే వారు ఈ సినిమా లో కూడా కనిపించబోతున్నారు.
ట్రైలర్ కు సోషల్ మీడియా ద్వారా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది.మీడియా వర్గాల వారు.
సినిమా వర్గాల వారు మరియు రౌడీ స్టార్ అభిమానులు మాత్రం లైగర్ ట్రైలర్ అదిరింది.
సినిమా మరింతగా అదురుతుందని అంటున్నారు.కాని కొందరు మాత్రం ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కు ఎంత వరకు కనెక్ట్ అవుతుంది అర్థం అవ్వడం లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
సోషల్ మీడియా లో లైగర్ కు సంబంధించిన చర్చ ను చూస్తూ ఉంటే ఫ్యామిలీ ఆడియన్స్ సినిమా విడుదల అయ్యి టాక్ వచ్చే వరకు వెళ్లే అవకాశాలు కనిపించడం లేదని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మరో వైపు విజయ్ దేవరకొండ లుక్ మరియు ఆయన బాక్సింగ్ సన్నివేశాలు.హావభావాలు కూడా కాస్త ఎబెట్టుగా ఉన్నాయనే విమర్శలు వస్తున్నాయి.
మొత్తానికి అందరికి లైగర్ నచ్చుతుందా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న గా మారింది.