'లైగర్‌' దృష్టి మొత్తం అక్కడేనా.. ఇక్కడ ఎప్పుడో మరి?

విజయ్ దేవరకొండ హీరో గా పూరి దర్శకత్వం లో రూపొందిన లైగర్‌ సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.

అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ను భారీ ఎత్తున విడుదల చేసేందుకు గాను పాన్‌ ఇండియా స్థాయి లో ప్రమోషన్స్ ను చేస్తామంటూ యూనిట్‌ సభ్యులు ప్రకటించారు.

హైదరాబాద్‌ లో భారీ ట్రైలర్‌ రిలీజ్ కార్యక్రమంను నిర్వహించిన యూనిట్ సభ్యులు మళ్లీ కనిపించకుండా వెళ్లి పోయారు.

ముంబయి లో లోకల్‌ ట్రైన్‌.బస్తీల్లో ఆఫీస్ ల్లో ఇలా జనాలు ఎక్కువ ఎక్కడ ఉంటే అక్కడ లైగర్ మరియు టీమ్‌ సందడి చేస్తున్నారు.

ముఖ్యంగా విజయ్ దేవరకొండ మరియు అనన్య పాండే లు చేస్తున్న ముంబయి సందడి వీడియో లు మరియు ఫోటోలు సోషల్‌ మీడియా లో వైరల్‌ అవుతున్నాయి.

పెద్ద ఎత్తున అంచనాలున్న లైగర్ సినిమా యొక్క ప్రమోషన్స్‌ ను చాలా యాక్టివ్‌ గా చేస్తున్నారు.

కాని ఉత్తరాదినే ఎక్కువ దృష్టి పెట్టడం తో అభిమానులు ఒకింత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

తెలుగు లో పెద్దగా సందడి చేయకున్నా పర్వాలేదు కాని కనీసం తమిళనాడు మరియు కేరళలో అయినా సినిమా ను ప్రమోట్‌ చేయాలని బయ్యర్లు విజ్ఞప్తి చేస్తున్నారు.

అక్కడ మార్కెట్‌ తక్కువ కనుక ఎక్కువ పబ్లిసిటీ చేస్తే బాగుంటుంది అనేది చాలా మంది అభిప్రాయం.

పూరి మాత్రం పూర్తిగా ముంబయి విషయం లోనే శ్రద్ద పెట్టినట్లుగా కనిపిస్తుంది.లైగర్ సినిమా లో భారీ ఎత్తున యాక్షన్ సన్నివేశాలు ఉండటం తో హిందీ ప్రేక్షకులు ఆధరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇదే సమయం లో తెలుగు ప్రేక్షకులు కూడా రౌడీ స్టార్‌ కోసం సినిమా ను చూస్తారు.

మరి ఇతర రాష్ట్రాల వారి పరిస్థితి ఏంటీ అనేది లైగర్‌ ఆలోచించాలి.

ఇంజనీరింగ్ చదవాలనుకునే విద్యార్థులకు శుభవార్త.. UK యూనివర్సిటీ నుంచి భారీ స్కాలర్‌షిప్‌లు!