విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’ టీజర్ రివ్యూ.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ వాయిస్ అదిరిపోయిందిగా!
TeluguStop.com
టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న హీరోలలో విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) ఒకరు.
విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి( Gautham Tinnanuri ) డైరెక్షన్ లో తెరకెక్కిన కింగ్‌డమ్ మూవీ( Kingdom Movie ) నుంచి తాజాగా టీజర్ విడుదలైంది.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ తో విడుదలైన ఈ టీజర్ నెక్స్ట్ లెవెల్ లో ఉందని ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చేలా ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు.
జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) వాయిస్ తో టీజర్ మాత్రం అదిరిపోయిందని చెప్పవచ్చు.
విజయ్ దేవరకొండ పాత్రకు అద్భుతంగా ఎలివేషన్ ఇవ్వడంతో జూనియర్ ఎన్టీఆర్ నూటికి నూరు శాతం సక్సెస్ అయ్యారు.
రెండు భాగాలుగా కింగ్‌డమ్ మూవీ తెరకెక్కుతుండగా మే నెల 30వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.
సమ్మర్ సెలవులను ఈ సినిమా బాగానే క్యాష్ చేసుకునే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు.
"""/" /
"అలసట లేని భీకర యుద్ధం.అలలుగా పారే వీరుల రక్తం.
వలసపోయినా అలసిపోయినా ఆగిపోనిది ఈ మహా రణం.నేలపైన దండయాత్రలు.
మట్టికిందా మృతదేహాలు.ఈ అలజడి ఎవరికోసం.
ఇంత భీభత్సం ఎవరికోసం.అసలు ఈ వినాశనం ఎవరికోసం.
రణభూమిని చీల్చుకుని పుట్టే కొత్త రాజు కోసం" అంటూ ఎన్టీఆర్ టీజర్ లో చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకున్నాయి.
"""/" /
కింగ్‌డమ్ మూవీ ఎప్పుడు విడుదలైనా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించడం పక్కా అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సితార నిర్మాతలు ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ మార్కెట్ ను మించి ఖర్చు చేశారని తెలుస్తోంది.
ఈ సినిమాలో యాక్షన్ కు పెద్దపీట వేశారని సమాచారం అందుతోంది.విజయ్ ఈ సినిమాలో నాయకుడిగా కనిపించనున్నారని తెలుస్తోంది.
విజయ్ దేవరకొండ రెమ్యునరేషన్ సైతం ఒకింత భారీ స్థాయిలోనే ఉంది.
విజయ్ దేవరకొండ స్టార్ హీరోగా మారాలంటే ఈ సినిమా సక్సెస్ అవ్వల్సిందేనా..?