విజయ్ కోరుకుంటున్న హిట్ ‘ఖుషీ’తో వస్తుందా.. ఫ్యాన్స్ లో టెన్షన్!

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) ప్రజెంట్ చేస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ''ఖుషి''.

ఈ సినిమా మరో వారం రోజుల్లో రిలీజ్ కాబోతుంది.అందుకే ఇప్పుడు టాలీవుడ్ ప్రేక్షకులతో పాటు విజయ్ ఫ్యాన్స్ అంతా ఖుషి సినిమా కోసమే ఎదురు చూస్తున్నారు.

లైగర్ వంటి ప్లాప్ తర్వాత విజయ్ నెక్స్ట్ చేస్తున్న సినిమా కావడంతో ఇదైనా బ్లాక్ బస్టర్ అవ్వాలని ఫాన్స్ కోరుకుంటున్నారు.

అయితే ఒక విషయంలో మాత్రం ఫ్యాన్స్ కొద్దిగా టెన్షన్ గా ఉన్నారు.డైరెక్టర్ శివ నిర్వాణ( Shiva Nirvana ) ఈ సినిమాను మరీ క్లాస్ గా తీసాడా అనే విషయంలో ఆందోళన గా ఉన్నారు.

ఇలాంటి సినిమాలతో ఇంతకు ముందు విజయ్ హిట్ అందుకున్న కూడా ఈ సినిమా విషయంలో ఆందోళనగానే ఉన్నారు.

ఎందుకంటే విజయ్ ఫ్యాన్స్ ఆయన సినిమాల నుండి కొన్ని ఎలిమెంట్స్ ను కోరుకోవడం ఖాయం.

"""/" / అలాంటివి లేకపోతే ఈ సినిమా హిట్ అవుతుంది అని చెప్పలేము.

అయితే ఖుషి సినిమా( Khushi Movie ) తప్పకుండ హిట్ అవుతుంది అని విజయ్ నమ్ముతున్నాడు.

సినిమా ట్రైలర్ రొటీన్ గా అనిపించినా అందరిని టచ్ చేస్తుందని ఎమోషనల్ సీన్స్ చాలా బలంగా ఉంటాయని చెబుతున్నాడు.

ఇక ప్రమోషన్స్ కూడా మరీ లైగర్ లా యాటిట్యూడ్ తో కాకుండా కూల్ గా చేస్తూ పోతున్నాడు.

"""/" / ఆ రేంజ్ లో ప్రమోషన్స్ చేసి మళ్ళీ ఆడియెన్స్ కు ఏదో ఉందని అంచనాలు పెంచేస్తే ఆ తర్వాత రిలీజ్ అయ్యాక బెడిసికొడుతుందేమో అని ప్రమోషన్స్ కూడా సెటిల్డ్ గా చేస్తూ పోతున్నారు.

మరి విజయ్ హిట్ అందుకుంటాడా లేదా అనేది చూడాలి.ఇక మైత్రి మూవీ మేకర్స్( Mythri Movie Makers ) భారీ స్థాయిలో పాన్ ఇండియన్ మూవీగా నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ కాబోతుంది.

మైక్ టైసన్‌ను భుజాలపై ఎత్తుకున్న వ్యక్తి.. తర్వాతేమైందో మీరే చూడండి..?