విజయ్ దేవరకొండ వల్లే వరల్డ్ ఫేమస్ లవర్ ఫెయిల్
TeluguStop.com
గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం తీవ్రంగా నిరాశ పర్చింది.
30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం కనీసం 10 కోట్లను కూడా రాబట్టే పరిస్థితి లేదు.
దాంతో ఈ సినిమా డిజాస్టర్ అని తేలిపోయింది.ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ఫ్లాప్ పై నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటున్నారు.
అందులో ఎక్కువ శాతం మంది ఈ సినిమా ఫ్లాప్‌కు కారణం హీరో విజయ్ దేవరకొండ వేలు పెట్టడం అంటూ చెవులు కొరుక్కుంటున్నారు.
"""/"/విజయ్ దేవరకొండ ఏ సినిమా చేసినా కూడా ఆ సినిమా స్క్రిప్ట్ నుండి రీ రికార్డింగ్ వరకు అన్నింట్లో కూడా వేలు పెడుతున్నాడట.
ఈమద్య కాలంలో తాను అన్నదే తీయాలి, అనుకున్నదే ఉంచాలి అన్నట్లుగా ఆయన ప్రవర్తిస్తునానడట.
క్రాంతి మాధవ్‌కు పూర్తి స్వేచ్చ ఇస్తే మంచి సినిమాను తీయగలడు.కాని ఆయనకు స్వేచ్చ ఇవ్వకుండా రౌడీ స్టార్ మొత్తం ఆక్రమించేశాడట.
సినిమాకు సంబంధించిన అన్ని విషయాల్లో కూడా తానే అన్ని అన్నట్లుగా వ్యవహరించాడని తెలుస్తోంది.
"""/"/విజయ్ దేవరకొండ ఈ చిత్రం మేకింగ్ విషయంలో వేలు పెట్టడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం ఈయన పూరి దర్శకత్వంలో లైగర్ అనే చిత్రాన్ని చేస్తున్నాడు.ఆ సినిమా మేకింగ్ విషయంలో విజయ్ దేవరకొండ సలహాలు ఇవ్వకుంటే మంచిది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
క్రిస్మస్ స్టాకింగ్‌లో లాటరీ టికెట్.. ఒక్క రాత్రిలో కోటీశ్వరురాలైంది..!