అప్పుడే సమంతతో ప్రేమలో పడిపోయాను.. విజయ్ దేవరకొండ షాకింగ్ కామెంట్స్?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

ఇప్పటికీ సమంత నటించిన రెండు మూడు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉండగా మరికొన్ని షూటింగ్ దశలో ఉన్నాయి.

సమంత నటించిన సినిమాలు ఇంకా పట్టాలు ఎక్కక ముందే ఆఫర్లు వచ్చి చేరుతున్నాయి.

కాగా సమంత చేతిలో బోలెడు ప్రాజెక్టులు ఉండగా మరొకటి సినిమాలు షూటింగ్ దశలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే సమంత ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం యశోద.

హరి హరీష్ సంయుక్తంగా ఈ సినిమాకు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.అయితే ఈ సినిమా ఇప్పటికీ విడుదల కావాల్సి ఉండగా పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది.

ఎట్టకేలకు ఈ సినిమా నవంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి.

సమంత నటించిన యశోదా సినిమా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకుంటుంది అని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కాగా తాజాగా యశోద సినిమా ట్రైలర్‌ ను తమిళంలో సూర్య, హిందీలో వరుణ్‌ ధావన్‌, కన్నడలో రక్షిత్‌ శెట్టి, మలయాళంలో దుల్కర్‌ సల్మాన్‌, తెలుగులో విజయ్‌ దేవరకొండ లాంటి స్టార్ హీరోలు ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు.

"""/"/ టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ట్రైలర్ లాంచ్ చేసి అనంతరం సమంత గురించి అభిప్రాయం వ్యక్తం చేశాడు విజయ్.

ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తూ కాలేజీలో చదువుకునే రోజుల్లో సమంత ను మొదటి సారిగా వెండితెర పై చూసి అభిమానిగా మారిపోయాను.

అప్పుడే ఆమెతో ప్రేమలో పడిపోయాను.ఇప్పటికీ నేను ఆమెను ఆరాధిస్తున్నాను అని ట్విటర్‌లో రాసుకొచ్చాడు విజయ్.

అలాగే యశోద సినిమా యూనిట్ కి ఆల్‌ ద బెస్ట్‌ అని చెప్పుకొచ్చాడు విజయ్.

Wild Bonos Y Promociones: Análisis Práctico Para Jugadores Mexicanos