శేఖర్ కమ్ములకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విజయ్ దేవరకొండ.. త్వరలోనే ప్రకటన?

ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరో విజయ్ దేవరకొండకు ఈ మధ్యకాలంలో వరుస పరాజయాలు ఎదురవడంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.

ఈ క్రమంలోనే ఆయన తన తదుపరి సినిమాల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది.

లైగర్ వంటి డిజాస్టర్ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ తన తదుపరి చిత్రాన్ని శివ నిర్వాణ దర్శకత్వంలో చేస్తున్నారు.

ఇక ఈ సినిమా అనంతరం ఈయన డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కోసం ఒక కథ సిద్ధం చేసుకున్నారని అయితే రామ్ చరణ్ తో ఆ సినిమా సాధ్యం కాకపోవడంతో అదే కథతో విజయ్ దేవరకొండతో సినిమా చేస్తున్నారని తెలుస్తుంది.

ఇక వీరిద్దరి కాంబినేషన్ తర్వాత రౌడీ హీరో సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చేయబోతున్నట్లు సమాచారం.

ఇప్పటికే వీరిద్దరి మధ్య పెద్ద ఎత్తున చర్చలు జరిగాయని శేఖర్ కమ్ముల విజయ్ దేవరకొండకు కథ వివరించడంతో ఈ సినిమాకు విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం.

"""/"/ ఒకానొక సమయంలో తన సినిమాలో చిన్న పాత్రలో నటించే అవకాశం కల్పించిన శేఖర్ కమ్ముల చివరికి విజయ్ హీరోగా సినిమా చేయబోతున్నారు.

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో చిన్న పాత్రలో నటించిన విజయ్ దేవరకొండకు ఎప్పటినుంచో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా చేయాలని కోరికగా ఉండేదట అయితే త్వరలోనే తన కోరిక నెరవేరబోతుందని, ఈ సినిమా గురించి త్వరలోనే అధికారక ప్రకటన వెలవడబోతుందని తెలుస్తోంది.

చ‌లికాలంలో మ‌ల‌బ‌ద్ధ‌కాన్ని పెంచే ఆహారాలు ఇవే..!