సైలెంట్ గా కొత్త సినిమా ప్రారంభించిన విజయ్ దేవరకొండ… ఫోటోలు వైరల్!
TeluguStop.com
ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి వరుస సినిమా అవకాశాలను అందుకుంటు ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vinay Devarakonda).
గత ఏడాది లైగర్ (Liger)అనే పాన్ ఇండియా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం శివానిర్వణ దర్శకత్వంలో ఖుషీ(Khushi) సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నారు.
ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు జోడిగా సమంత(Samantha) నటిస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు జరుపుకుంటుంది.
ఇకపోతే విజయ్ దేవరకొండ తాజాగా మరో సినిమాని కూడా ప్రారంభించేశారు. """/" /
గతంలో ఈయన గౌతం తిన్ననూరి(Gowtam Tinnanuri) దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారంటూ ప్రకటించిన విషయం మనకు తెలిసిందే.
అయితే ఎలాంటి చడి చప్పుడు లేకుండా తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలను కూడా ప్రారంభించారు.
ప్రస్తుతం ఈ పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక ఈ సినిమా విజయ్ దేవరకొండకు 12 వ సినిమా కావటం విశేషం.
ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన నటి శ్రీ లీల(Sreeleela) నటిస్తున్నారు.
ఇక ఈ పూజా కార్యక్రమాలలో శ్రీ లీల స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.
"""/" /
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్, త్రివిక్రమ్ ఫార్ట్యూన్ 4 సినిమాస్ సంస్థలు నిర్మించనున్నాయి.
ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.
గతంలో ఈ సినిమా గురించి అనౌన్స్ చేస్తూ.నేను ఎవరిని మోసం చేశానో చెప్పలేను ఎందుకంటే నేను ఎక్కడి నుంచి వచ్చానో తెలియదు అనే కొటేషన్ ఉన్న పోస్టర్ విడుదల చేస్తూనే సినిమా పై ఆసక్తి పెంచారు.
త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పనులు జరుపుకోనుంది.అయితే ముందుగా ఈ స్టోరీని గౌతమ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కు వినిపించగా కొన్ని కారణాలవల్ల ఆయన రిజెక్ట్ చేయడంతో విజయ్ దేవరకొండ ఈ ప్రాజెక్టులో నటిస్తున్నారు.
మెడ మొత్తం నల్లగా అసహ్యంగా మారిందా.. ఇంట్లోనే ఈజీగా రిపేర్ చేసుకోండిలా..!