రౌడీ స్టార్‌పై కోపంతో రగిలి పోతున్న డాక్టర్లు
TeluguStop.com
విజయ్ దేవరకొండ ఏం మాట్లాడినా డైరెక్ట్‌గా మాట్లాడేస్తాడు.మొహమాటం లేకుండా ఉన్నది ఉన్నట్లుగా చెప్పేస్తూ ఉంటాడు.
అలా చేయడం వల్ల చాలా సార్లు విమర్శల పాలయిన విషయం తెల్సిందే.పలు సందర్బాల్లో ఆయన మాట్లాడిన మాటలపై కొందరు మీడియా ముందుకు వచ్చి మరీ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెల్సిందే.
తాజాగా మరోసారి విజయ్ దేవరకొండ మాట్లాడిన మాటలు వివాదాస్పదం అయ్యాయి. """/"/తాజాగా వరల్డ్ ఫేమస్ వర్ చిత్రంతో ఈయన ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.
భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రంకు ప్రేక్షకుల నుండి అంతంత మాత్రంగానే రెస్పాన్స్ వస్తుంది.
ఇలాంటి సమయంలో విజయ్ దేవరకొండ సినిమా ప్రమోషన్ సమయంలో మాట్లాడిన ఒక మాట ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది.
అదే మాట డాక్టర్లకు కోపాన్ని కూడా తెప్పించింది.వారు వెంటనే క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
"""/"/ఒక ఇంటర్వ్యూలో హీరోయిన్ రాశిఖన్నా మాట్లాడుతూ నాకు డాక్టర్‌తో డేటింగ్ చేయాలని ఉంది అంటూ చెప్పుకొచ్చింది.
ఆమె మాటలకు స్పందించిన విజయ్ దేవరకొండ డాక్టర్లు శరీరంలోని పార్ట్స్‌ను సైంటిఫిక్ నేమ్స్‌తో పిలుస్తారు.
వారు ఏం చేసినా కూడా సైంటిఫిక్‌గా ఆలోచిస్తారు అంటూ వారికి రొమాంటిక్ యాంగిల్ తక్కువ ఉంటుంది అన్నట్లుగా మాట్లాడాడు.
దాంతో డాక్టర్లు తమను అవమాన పర్చే విధంగా విజయ్ దేవరకొండ మాట్లాడాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరి విజయ్ దేవరకొండ వారు కోరినట్లుగా క్షమాపణ చెప్తాడా లేదా అనేది చూడాలి.
ఈగ సినిమాకు సీక్వెల్ వస్తోందట.. అసలు ట్విస్ట్ తెలిస్తే మాత్రం అవాక్కవ్వాల్సిందే!