Vijay Devarakonda : రామ్ చరణ్ రికార్డ్ ను సులువుగా బ్రేక్ చేసిన విజయ్ దేవరకొండ.. ఈ రౌడీ హీరో మామూలోడు కాదంటూ?

స్టార్ హీరో రామ్ చరణ్( Ram Charan ) తన సినీ కెరీర్ లో ఎన్నో సంచలన రికార్డ్ లను సొంతం చేసుకున్నారు.

రెండో సినిమా మగధీరతోనే బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్ ను సాధించి చరణ్ చరిత్ర తిరగరాశారు.

మగధీర మూవీ పాన్ ఇండియా మూవీగా విడుదలై ఉంటే అప్పట్లోనే ఈ సినిమా సులువుగా 200 నుంచి 300 కోట్ల రూపాయల రేంజ్ లో కలెక్షన్లను సాధించి ఉండేదని చెప్పడంలో సందేహం అవసరం లేదు.

అయితే విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) తాజాగా రామ్ చరణ్ రికార్డ్ ను సులువుగా బ్రేక్ చేసి వార్తల్లో నిలిచారు.

ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్ల( Instagram Followers ) విషయంలో విజయ్ దేవరకొండ సరికొత్త రికార్డ్ ను సృష్టించారు.

విజయ్ దేవరకొండ ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య 21 మిలియన్లుగా ఉంది.ఈ విషయం తెలిసిన నెటిజన్లు ఈ రౌడీ హీరో మామూలోడు కాదంటూ కామెంట్లు చేస్తున్నారు.

రామ్ చరణ్ తాజాగా 20 మిలియన్ మార్క్ ను ఇన్ స్టాగ్రామ్ లో చేరుకోగా అలవోకగా విజయ్ దేవరకొండ ఆ రికార్డ్ ను బ్రేక్ చేశారు.

"""/" / విజయ్ దేవరకొండ గత సినిమా ఖుషి( Khusi Movie ) పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్నా కొన్ని ఏరియాలలో ఆశించిన రేంజ్ లో కలెక్షన్లు రాలేదు.

అయితే ఫ్యామిలీ స్టార్( Family Star Movie ) మాత్రం సెలవులు ఎక్కువగా ఉన్న సమయంలో రిలీజ్ అవుతుండటంతో ఈ సినిమాకు కలెక్షన్లు భారీగా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది.

విజయ్ దేవరకొండ పారితోషికం కూడా భారీ రేంజ్ లోనే ఉంది. """/" / బ్యాగ్రౌండ్ లేకుండా స్టార్ స్టేటస్ ను అందుకున్న విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ గ్లింప్స్ తో ఈ సినిమాపై అంచనాలు పెంచారు.

ఐరనే వంచాలా ఏంటి డైలాగ్ ఏ స్థాయిలో వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

పరశురామ్ ఈ సినిమాతో కెరీర్ బెస్ట్ హిట్ ను అందుకుంటానని నమ్ముతున్నారు.

వైరల్: ఏలియన్ కు గుడి కట్టిన వ్యక్తి ..