లైగర్ ప్లాప్.. అయినా ఎక్కడా బాధ లేదు.. జిమ్ లో అలా కనిపించి షాకిచ్చిన దేవరకొండ!
TeluguStop.com
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ గురించి మనందరికీ తెలిసిందే.విజయ్ దేవరకొండ తాజాగా నటించిన చిత్రం లైగర్.
తాజాగా విడుదలైన ఈ సినిమా ఊహించిన విధంగా నెగటివ్ టాక్ ని తెచ్చుకుంది.
అయితే ప్రేక్షకులు ఈ సినిమాపై భారీగా అంచనాలు పెట్టుకోగా ఈ సినిమా విడుదల ఊహించని విధంగా ఇలా యావరేజ్ టాక్ ని తెచ్చుకోవడంతో అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
అంతేకాకుండా హీరో విజయ్ దేవరకొండపై నెగిటివ్ కామెంట్స్ కూడా చేస్తున్నారు.అయినప్పటికీ విజయ్ దేవరకొండ క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు.
విజయ్ దేవరకొండ పై ఎన్ని విధాలుగా నెగిటివ్ కామెంట్స్ వినిపించినా కూడా విజయ్ దేవరకొండ మాత్రం ఏ మాత్రం స్పందించకుండా తన పని తాను చేసుకుంటూ వెళుతున్నాడు.
కాజా విజయ్ దేవరకొండ లైగర్ సినిమా కోసం ఎంత కష్టపడ్డాడు అన్నది విజేతన మాటల్లో చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే.
విజయ్ మాటలతో పాటు తాను ఎంత కష్టాపడ్డాడు అన్నది వెండితెరపై కూడా కనిపిస్తుంది.
మరి ముఖ్యంగా విజయ్ దేవరకొండ తన ఫిట్నెస్ విషయంలో ఎంతో జాగ్రత్తలు తీసుకున్న విషయాన్ని తెలిసిందే.
టైగర్ సినిమా విడుదల ఈ నెగటివ్ టాక్ ని తెచ్చుకున్న కూడా రెండవ రోజే మళ్లీ విజయ్ తన తదుపరి సినిమా కోసం సిద్ధమవుతున్నట్లు కనిపిస్తున్నాడు.
"""/"/
సినిమా విడుదలైన మరుసటిరోజే విజయ్ దేవరకొండ జిమ్ లో కష్టపడుతూ కనిపించాడు.
అందుకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.కాగా విజయ్ దేవరకొండ తన తదుపరి సినిమా శివ నిర్వాన దర్శకత్వంలో చేయబోతున్న విషయం మనందరికీ తెలిసిందే.
ఖుషి అనే టైటిల్ తో దొరికితే పోతున్న ఆ సినిమాలో సమంత హీరోయిన్ గా నటించనుంది.
అయితే సినిమా విడుదల అయ్యి నెగటివ్ టాక్ ని తెచ్చుకున్న కూడా విజయ్ దేవరకొండ ఏ మాత్రం పట్టించుకోకుండా జిమ్ లో తన తదుపరి సినిమా కోసం కష్టపడుతుండడం పై పలు విమర్శలు గుప్పిస్తుండగా ఇంకొందరు మాత్రం విజయ్ కి మద్దతుగా మాట్లాడుతున్నారు.
పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేస్తే మహేష్ ఓకే చెప్పాడు.. సినిమా ఫ్లాప్.. ఆ సినిమా ఏదంటే?