'లైగర్‌' ఇచ్చే సర్‌ ప్రైజ్ ఏంటో రివీల్‌ చేసిన యూనిట్‌

విజయ్ దేవరకొండ హీరోగా అనన్య పాండే హీరోయిన్ గా పూరి జగన్నాద్‌ దర్శకత్వం లో రూపొందిన లైర్‌ సినిమా ఆగస్టు లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ పూర్తి అయ్యి నెలలు గడుస్తోంది.

సినిమా విడుదల తేదీకి సరైన సమయం లేకపోవడంతో ఆగస్టు లో విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటన వచ్చింది.

భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా థీమ్‌ వీడియోను విడుదల చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెప్పేశారు.

తాజాగా విజయ్ దేవరకొండ పుట్టిన రోజు అయిన మే 9న భారీ ఎత్తున సర్ ప్రైజ్ ప్లాన్‌ చేశాం అంటూ నిర్మాత ఛార్మి మరియు పూరి లు ప్రకటించారు.

ఆ సర్‌ ప్రైజ్ ఏంటీ అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూసిన సమయంలో యూనిట్‌ సభ్యుల నుండి క్లారిటీ వచ్చేసింది.

లైగర్‌ సినిమా లో హీరో పాత్రకు మరియు విజయ్ దేవరకొండ పాత్రకు ఉన్న పోలికలను గురించి చూపించబోతున్నట్లుగా చెప్పేశారు.

వీడియో ను కేవలం తెలుగు లో మాత్రమే కాకుండా అన్ని సౌత్‌ భాష ల్లో మరియు హిందీ లో కూడా విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటన వచ్చింది.

భారీ ఎత్తున అంచనాలున్న లైగర్‌ సినిమా షూటింగ్‌ పూర్తి అయిన నేపథ్యం లో ఆగస్టు లో విడుదల కన్ఫర్మ్‌ గా చెప్పేశారు.

సినిమా విడుదలకు ఇంకా మూడు నెలల సమయం ఉండటంతో కాస్త హడావుడి మెల్లగానే చేస్తున్నారు.

జులై నుండి లైగర్‌ హడా వుడి మొదలు అయ్యే అవకాశం ఉందంటున్నారు. విజయ్ దేవరకొండ పుట్టిన రోజు వీడియో కోసం ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యం లో దర్శకుడు పూరి జగన్నాథ్ భారీ అంచనాలు పెంచే విధంగా వీడియో ను రూపొందించినట్లు యూనిట్ సభ్యులు చెబుతున్నారు.

మూవీ రిలీజైన వారానికే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న కృష్ణమ్మ.. ఇలా చేయడం రైటేనా?