చైల్డ్ ఆర్టిస్ట్ వీడియో వెనుక అసలు స్టోరీ చెప్పిన విజయ్ దేవరకొండ?

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ప్రస్తుతం విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లైగర్ సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నాడు.

ఇక ఇందులో విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ సినిమాకు నిర్మాతగా ఛార్మి వ్యవహరిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే.ప్రస్తుతం ఈ సినిమాకు సంబందించిన షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.

ఈ సినిమాను పూరి జగన్నాథ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా 125 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు.

ఇక పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా తెరకెక్కబోతుండడంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి.

ఇదిలా ఉంటే తాజాగా లైగర్ చిత్ర బృందం హీరో బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షో లో సందడి చేశారు.

ఇక ఈ షోకీ పూరి జగన్నాథ్, ఛార్మి, హీరో విజయ్ దేవరకొండ హాజరయ్యారు.

ఈ క్రమంలోనే బాలయ్యబాబు వారితో పలు రకాల గేమ్స్ కూడా ఆడించాడు.ఈ నేపథ్యంలోనే విజయ్ దేవరకొండ చిన్ననాటి వీడియో టెలికాస్ట్ చేయించాడు.

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ ఇద్దరు పుట్టపర్తి ఆశ్రమంలో చదువుకున్నారు అన్న విషయం అందరికి తెలిసిందే.

"""/"/ ఆ సమయంలోనే విజయ్ దేవరకొండ అక్కడ తీసిన ఒక సీరియల్ లో నటించాడు.

అప్పట్లో ఈ వీడియో వైరల్ అయ్యింది.ఆ వీడియోని స్టేజ్ పై టెలికాస్ట్ చేయగా ఆ వీడియో కి సంబంధించిన అసలు స్టోరీ నీ విజయ్ దేవరకొండ చెప్పాడు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇక ఆ వీడియో ని చూడగానే విజయ్ దేవరకొండ ఒక్కసారిగా పళ్ళుమని నవ్వాడు.

ఆ వీడియోలో ఉన్న మనిషి నేనే కానీ వాయిస్ నాది కాదు అంటూ ఆ వీడియో కి సంబంధించిన అసలు విషయాన్ని బయట పెట్టాడు.

పోలీస్‌కే చుక్కలు చూపించిన దున్నపోతు.. అతను ఏం చేశారో చూస్తే..??