మళ్లీ అర్జున్‌ రెడ్డి అవతారం ఎత్తుతున్న విజయ్‌ దేవరకొండ.. ఈసారి కోలీవుడ్‌ ప్రేక్షకుల ముందుకు

విజయ్‌ దేవరకొండ స్థాయిని అమాంతం పెంచేసిన చిత్రం 'అర్జున్‌ రెడ్డి'.తెలుగులో బ్లాక్‌ బస్టర్‌ చిత్రంగా రూపొందిన అర్జున్‌ రెడ్డి సినిమా తమిళంలో మరియు హిందీలో రీమేక్‌ అవుతుంది కదా, మళ్లీ తమిళ ప్రేక్షకుల ముందుకు అర్జున్‌ రెడ్డి ఏంటా అంటూ ఆశ్చర్య పోతున్నారా.

అసలు విషయం ఏంటీ అంటే విజయ్‌ దేవరకొండ గత చిత్రం 'ద్వారక'.ఈ చిత్రం తెలుగులో ఫ్లాప్‌ అయ్యింది.

ఏమాత్రం ఆకట్టుకోలేక పోయిన ద్వారక చిత్రాన్ని తమిళంలో డబ్‌ చేసి విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

విజయ్‌ దేవరకొండకు తమిళనాట మంచి క్రేజ్‌ ఉంది.అందుకే అక్కడ ద్వారక ను విడుదల చేసి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ ద్వారక చిత్రాన్ని అదే టైటిల్‌తో కాకుండా విభిన్నంగా 'అర్జున్‌ రెడ్డి' టైటిల్‌తో విడుదల చేయాలని భావిస్తున్నారు.

అర్జున్‌ రెడ్డి టైటిల్‌ తమిళనాట కూడా బాగా పాపులర్‌ అయ్యింది.అర్జున్‌ రెడ్డి రీమేక్‌ తమిళంలో తెరకెక్కుతుందని మీడియాలో పదే పదే వార్తలు వచ్చిన కారణంగా అర్జున్‌ రెడ్డి గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది.

అందుకే అర్జున్‌ రెడ్డి మూవీ అంటూ తమిళంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.తమిళంలో నోటా చిత్రంతో విజయ్‌ దేవరకొండ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

తమిళంలో ఆ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందని అంతా భావించారు.కాని తెలుగులో మరియు తమిళంలో మెప్పించలేక పోయింది.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ 'పెళ్లి చూపులు' చిత్రం తర్వాత ద్వారక చిత్రంలో నటించిన విజయ్‌ దేవరకొండ ఆకట్టుకోలేక పోయాడు.

ఆ సినిమాలో విజయ్‌కి జోడీగా పూజా జవేరి హీరోయిన్‌గా నటించింది.ప్రస్తుతం విజయ్‌ దేవరకొండకు ఉన్న క్రేజ్‌ నేపథ్యంలో ఈ చిత్రం తప్పకుండా ఆకట్టుకుంటుందనే నమ్మకం సినీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది.

అతి తక్కువ రేటుకే డబ్బింగ్‌ రైట్స్‌ను దక్కించుకున్న నిర్మాత ప్రస్తుతం దాన్ని ఎక్కువగా ప్రమోట్‌ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.

ఆస్ట్రేలియా ఫెడరల్ ఎన్నికల బరిలో భారత సంతతి మహిళా డాక్టర్