రష్మిక, విజయ్‌ ఇద్దరు ఒక్క చోట లేరని ఇప్పుడు చెప్పగలరా?

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన తాజాగా మాల్దీవ్స్ కి వెళ్ళిన విషయం తెలిసిందే.

వీరిద్దరు విడివిడిగా విమానాశ్రయానికి చేరుకున్నా కూడా కచ్చితంగా ఇద్దరు వెళ్ళింది మాల్దీవ్స్ కే అని గంట పదంగా అందరు చెప్పేస్తున్నారు.

అయినా కూడా ఇప్పటికీ వారిద్దరు ఆ విషయాన్ని ఒప్పుకోవడం లేదు.వారిద్దరు ఒప్పుకున్న ఒప్పుకోకున్నా కొన్ని సాక్ష్యాలు ఇప్పటికే వారిద్దరూ ఒకచోట ఉన్నారు.

మాల్దీవ్స్ లో ఉన్నారు అంటూ చెప్పగానే చెప్తున్నాయి.ముఖ్యంగా విజయ్ దేవరకొండ విమానాశ్రయం లో కనిపించిన సమయంలో పెట్టుకున్న కళ్ళ జోడు మరియు రష్మిక మందన మాల్దీవ్స్ లో పెట్టుకున్న కళ్ళ జోడు సేమ్ టు సేమ్.

కనుక వారిద్దరూ ఒకే చోట ఉన్నారు.కళ్ళజోడు మార్చి మార్చి పెట్టుకుంటూ ఫోటోలకు ఫోజులిస్తున్నారంటూ సోషల్ మీడియాలో వీరిద్దరి గురించి మీమ్స్‌ వస్తున్నాయి.

ప్రస్తుతానికి వీరిద్దరూ మాత్రమే వెళ్లారా లేదంటే స్నేహితులతో కలిసి మాల్దీవ్స్ కి వెళ్ళారా అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.

"""/"/ సాధారణంగా పెళ్లయిన కొత్త జంటలు మాల్దీవ్స్ కి వెళ్తూ ఉంటారు, కానీ వీరిద్దరి మాల్దీవ్స్ కి వెళ్లడమేంట్రా బాబు అంటూ చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

సోషల్ మీడియాలో వీరిద్దరి గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నాయి.ఈ నేపద్యంలో ఇన్ని రోజులు కొందరు ఆ ప్రచారాన్ని నమ్మలేదు.

కానీ ఇప్పుడు నమ్మాల్సి వస్తుందని స్వయంగా వారే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ప్రేమలో ఉన్నామని ఇన్నాళ్లు చెప్పకుండా దాస్తున్న విజయ్ దేవరకొండ మరియు రష్మిక ముందు ముందు అయినా ప్రేమ విషయాన్ని చెప్పకుండా ఉంటారా అంటూ మీడియాలో కొందరు ప్రశ్నిస్తున్నారు.

ఒక వైపు గుడ్ బాయ్ సినిమా ఫెయిల్యూర్ అయినా బాధ ఏమాత్రం లేకుండా రష్మిక మందన హాయిగా మాల్దీవ్స్ లో స్నేహితుడు విజయ్ దేవరకొండ తో కలిసి ఎంజాయ్ చేస్తుంది.

బాలయ్య తండ్రికి తగ్గ తనయుడు…. బాలయ్య పై ప్రశంసలు కురిపించిన ఊర్వశి!