మళ్లీ రిపీట్..విజయ్ దేవరకొండతో నాని క్లాష్
TeluguStop.com
పండుగల సమయంలో సినిమాలన్నీ ఒకేసారి రిలీజ్ అవుతూ ఉంటాయి.దీంతో ఈ సమయంలో హీరోల మధ్య పోటీ నెలకొంటుంది.
ఒకేసారి రెండు సినిమాలు విడుదల కావడం వల్ల సినిమా కలెక్షన్లు కూడా ఆయా సినిమాలకు తగ్గుతాయి.
దీంతో ఇలా సినిమాల విషయంలో క్లాష్ రాకుండా నిర్మాతలు చూసుకుంటారు.కానీ పండుగల సమయంలో ఒకేసారి రెండు, మూడు సినిమాలు విడుదల కావడం ప్రతిసారి జరుగుతోంది.
అలాగే ఈ సారి విజయ్ దేవరకొండ, నాని సినిమాలు ఒకేసారి విడుదల కానున్నాయి.
నేచురల్ స్టార్ నాని నటించిన అంటే సుందరానికి సినిమా ప్రస్తుతం విడుదలైన విషయం తెలిసిందే.
బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మిక్స్ డ్ టాక్ సంపాదించుకుంది.దీని తర్వాత ఓడెల కాంబినేషన్ లో దసరా పేరుతో నాని సినిమా చేస్తున్నాడు.
కీర్తి సురేష్ ఇందులో హీరోయిన్ నటిస్తుండగా.సింగరేణి గనుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా ఈ ఏడాది డిసెంబర్ లో విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు.
"""/"/ గతంలో 2017లో మిడిల్ క్లాస్ అబ్బాయి, 2021లో శ్యామ్ సింగరాయ్ క్రిస్మస్ సీజన్ లో విడుదలయ్యాయి.
ఆ రెండు సినిమాలకు మంచి స్పందన వచ్చింది.దీంతో దసరా సినిమాను కూడా క్రిస్మస్ కు విడుదల చేయాలని మేకర్స్ ను నాని ఒప్పించినట్లు తెలుస్తోంది.
"""/"/
అయితే యంగ్ హీరో విజయ్ దేవరకొండ, సమంత కాంబినేషన్ లో ఖుషి సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
ఈ సినిమాను డిసెంబర్ 23న విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు.దీంతో ఈ సారి నాని, విజయ్ దేవరకొండ మధ్య క్రాష్ తప్పదని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
కాగా గతంలో ఎవడే సుబ్రమణ్యం సినిమాలో నాని, విజయ్ దేవరకొండ కలిసి నటించారు.