ధనవంతులకు ఓటు హక్కు అవసరం లేదు : విజయ్ దేవరకొండ !

విజయ్ దేవరకొండ .అర్జున రెడ్డి సినిమాతో టాలీవుడ్ యూత్ ఐకాన్ గా మారి , వరుస విజయాలతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు.

హీరోగా విజయ్ దేవరకొండను అభిమానించే వారు కొందరైతే, విజయ్ మ్యానరిజం నచ్చి అభిమానులుగా మారిన వారు కొందరు.

ఏది మాట్లాడినా దానిపై పక్కా క్లారిటీ ఇచ్చేస్తాడు.అదే నేడు ఇండస్ట్రీలో స్టార్ గా మారడానికి దోహదపడింది.

ఇదిలా ఉంటే విజయ్ తాజాగా మన పాలకుల పై , ఓటింగ్ వ్యవస్థ పై , తన పొలిటికల్ ఎంట్రీ పై స్పందించారు.

నేను రాజకీయాల్లోకి రాను రాజకీయాలకు వెళ్ళడానికి నాకు ఓపిక లేదు.పొలిటికల్ సిస్టమ్ అంటేనే సెన్స్ లేదనిపిస్తుంది.

చాలా మంది ఓటు వేయడానికి ఇంట్రెస్టు చూపరు.డబ్బు కోసం, చీప్ లిక్కర్ కోసం ఓటు వేసే వాళ్ళున్నారు.

పేద వాళ్ళు, డబ్బున్న వాళ్ళ కంటే మిడిల్ క్లాస్ వాళ్ళే ఈ ట్రాప్‌ లో పడుతున్నారు.

ఎవరికి ఎందుకు ఓటు వేసున్నామో కూడా తెలియకుండా ఓటు వేసే వాళ్ళని గమనించ వచ్చు.

డబ్బు కోసం.లిక్కర్ కోసం ఓట్లు వేసినన్ని రోజులు ప్రగతి కష్టం.

డిక్టేటర్ ‌షిప్‌ లో అయితే ఛేంజ్ వస్తుంది.పాలిటిక్స్ ‌తో ఛేంజ్ రావడం కష్టం అన్నది నా భావన అని విజయ్ దేవరకొండ చెప్పారు.

అలాగే ధనవంతులకు ఓటు అనవసరం అని , అలాగే లిక్కర్ కోసం ఓటు వేసే వారికీ కూడా ఓటు హక్కు అవసరం లేదని , కేవలం చదువుకున్న మిడిల్ క్లాస్ వారికీ ఓటు హక్కు ఉంటే బాగుంటుంది అని చెప్పారు.

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. బిగ్ అప్డేట్ ఇవ్వబోతున్న ప్రశాంత్ నీల్?