ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసిన విజయ్ దళపతి.. ఆ ఇంటి ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
TeluguStop.com
కోలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న విజయ్ దళపతి ప్రస్తుతం తమిళ తెలుగు సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.
ఇలా వరుస సినిమాలతో నటిస్తూ కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నటువంటి ఈయన తాజాగా చెన్నైలో ఓ ఖరీదైన ప్రాంతంలో భారీ ధరకు కొత్త ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఈయన చెన్నైలోని ఈస్ట్ కోస్ట్ రోడ్‌లో ఉన్న ఇంటిలో నివసిస్తున్నారని తెలుస్తోంది.
అయితే ఇక్కడ ట్రాఫిక్ అధికంగా ఉండటం వల్ల ఈయన తన ఇంటిని మార్చాలని భావించారట.
ఈ క్రమంలోనే చెన్నైలోనే ఖరీదైన ప్రాంతంలో ఒక అపార్ట్మెంట్ కొనుగోలు చేశారని, త్వరలోనే ఆ ఇంటికి మారబోతున్నారని కోలీవుడ్ సమాచారం.
ఇకపోతే విజయ్ దళపతి కొత్తగా కొనుగోలు చేసిన అపార్ట్మెంట్ ధర తెలిసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు.
ఈయన ఏకంగా 35 కోట్ల రూపాయల ఖర్చు చేసి ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్ కొనుగోలు చేశారని తెలుస్తోంది.
త్వరలోనే విజయ్ తన ఫ్యామిలీతో అక్కడికి షిఫ్ట్ అవుతున్నారట. """/"/
ఇకపోతే విజయ్ ఇప్పటివరకు ఈస్ట్ కోస్ట్ రోడ్‌లో ఉన్నటువంటి ఇంటిలో నివసిస్తున్నప్పటికీ ఈయన అడయార్ లో ఉన్నటువంటి ఇంటిలో తన విజయ్ మక్కల్ ఇయ్యకం పార్టీ కార్యాలయాన్ని స్థాపించి అక్కడే పార్టీ కార్యక్రమాలు చూసుకునేవారు.
అయితే ఇప్పుడు కొత్తగా కొనుగోలు చేసిన అపార్ట్మెంట్ లోనే తన పార్టీ కార్యాలయాన్ని నిర్వహించాలని భావిస్తున్నారట.
ఇలా విజయ్ కొనుగోలు చేసిన ఈ ఇంటి గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.
ఇక ఈయన సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఈయన తెలుగులో వారసుడు అనే సినిమాలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.
ఆ దేశం న్యూస్ పేపర్ లో డాకు మహారాజ్.. బాలయ్యకు దక్కిన అరుదైన ఘనత ఇదే!