Vijay Copied Dance Steps : ఎన్టీఆర్, ప్రభాస్, బన్నీ, పవన్ స్టెప్స్ కాపీ కొట్టిన విజయ్.. ఎన్ని ఎన్ని దారుణాలంటూ?

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్( Vijay ) సినీ కెరీర్ లో ఎన్నో సంచలన విజయాలు ఉన్నాయి.

విజయ్ సినిమాలు తెలుగులో డబ్ అయ్యి ఇక్కడి ప్రేక్షకులను సైతం చాలా సందర్భాల్లో ఆకట్టుకున్నాయి.

ప్రస్తుతం రెండు క్రేజీ ప్రాజెక్ట్ లలో నటిస్తున్న విజయ్ ఈ సినిమాల తర్వాత సినిమా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పి రాజకీయాలతో బిజీ కానున్నారని సమాచారం అందుతోంది.

అయితే ఎన్టీఆర్, ప్రభాస్, బన్నీ, పవన్ స్టెప్స్ ను విజయ్ కాపీ కొట్టాడంటూ ఒక వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ప్రభాస్ బిల్లా,( Billa ) చిరంజీవి ఇంద్ర,( Indra ) యంగ్ టైగర్ ఎన్టీఆర్ యమదొంగ,( Yamadonga ) బన్నీ ఆర్య2, వెంకటేశ్ నువ్వు నాకు నచ్చావ్, పవన్ కళ్యాణ్ తమ్ముడు సినిమాలలోని స్టెప్స్ ను విజయ్ కాపీ కొట్టారని నెట్టింట వైరల్ అవుతోంది.

ఈ వీడియోను చూసిన నెటిజన్లు మరీ డ్యాన్స్ స్టెప్స్ ను కూడా కాపీ కొట్టడం ఏంటని కామెంట్లు చేస్తున్నారు.

ఒక ఇన్ స్టాగ్రామ్ పేజ్ ఈ వీడియోను పోస్ట్ చేయగా ఆ వీడియో నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది.

"""/" / కాపీ పేస్ట్ రిపీట్ అంటూ మరి కొందరు సెటైరికల్ గా కామెంట్లు చేస్తున్నారు.

అయితే విజయ్ తప్పేం లేదని కాపీ కొట్టిన డ్యాన్స్ మాస్టర్ల తప్పు అని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.

విజయ్ వెంకట్ ప్రభు డైరెక్షన్ లో ప్రస్తుతం నటిస్తున్నారు.వెంకట్ ప్రభు( Venkat Prabhu ) గత సినిమా కస్టడీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.

అయితే వెంకట్ ప్రభు ట్రాక్ రికార్డ్ తో సంబంధం లేకుండా ఆయనకు సినిమా ఆఫర్లు వస్తున్నాయి.

"""/" / విజయ్ తర్వాత సినిమాలు సైతం తెలుగులో భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల కానున్నాయి.

సినిమా సినిమాకు విజయ్ మార్కెట్ ను పెంచుకుంటున్నారు.విజయ్ పారితోషికం 150 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది.

స్టార్ హీరో విజయ్ కథల ఎంపికలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది.

న్యాచురల్ స్టార్ ఫేవరెట్ హీరోయిన్ ఆమేనట.. ఎవరో తెలిస్తే ఒకింత షాకవ్వాల్సిందే!