విజయ్ ఆంటోనీ సంగీతం అందించిన తెలుగు సినిమాలు ఏంటో తెలుసా ?
TeluguStop.com
ఇటీవల భార్యతో విడాకుల విషయంలో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టి చెప్పి చెప్పనట్టుగా ఎదో చెప్పేసి అందరిని కన్ఫ్యూజ్ చేసాడు హీరో విజయ్ ఆంటోనీ.
అతడిని కేవలం అంటే అది ఖచ్చితంగా తప్పే అవుతుంది.అతడొక ఒక ఎడిటర్ సినిమాలను ఎడిట్ చేయడం లో సిద్ద హస్తుడు.
అంతకు మించిన ఒక సంగీత దర్శకుడు.ఎన్నో సినిమాలకు సంగీత దర్శకత్వం అందించి అవార్డులు కూడా అందుకున్నాడు.
ఇక ఆయనకు ఉన్న మరొక ఆయుధం గాత్రం.ఎంత బాగా సంగీతం కొట్టగలడో అంతే బాగా పాడగలడు కూడా.
2005 లో మొదటి సారిగా ఒక సింగర్ గా, ఒక సంగీత దర్శకుడిగా సినిమా ఇండస్ట్రీ కి ఒకేసారి ఎంట్రీ ఇచ్చాడు.
ఆ తర్వాత ఏడాది తిరక్కుండానే నటనలోకి ప్రవేశించాడు.అప్పుడు మొదలెట్టిన నటన ప్రస్థానం 18 ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది.
కేవలం నటుడిగా మాత్రమే కాదు.ప్రతి ఏటా ఎన్ని సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడో అన్నే సినిమాల్లో పాటలు పాడుతూ సంగీతం కూడా చేస్తున్నాడు.
సినిమా ఇండస్ట్రీ లో ఇలా అన్ని విభాగాల్లో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న హీరోలలో విజయ్ ఆంటోనీ మాత్రమే ముందు వరసలో ఉంటాడు.
ఇక విజయ్ ఆంటోనీ పేరుకు మాత్రమే తమిళుడు కానీ సౌత్ లోని అన్ని భాషల్లో పట్టు సాధించాడు.
అందుకే కేవలం తమిళం లోనే కాకుండా తెలుగు సినిమాలకు కూడా సంగీత దర్శకత్వం చేపట్టి, పాటలు కూడా పాడాడు.
కన్నడలో కూడా రెండు సినిమాకు సంగీత దర్శకత్వం అందించాడు విజయ్ """/"/
ఇక విజయ్ ఆంటోనీ సంగీతం అందించిన సినిమాల్లో ఒకటి శ్రీకాంత్ హీరోగా నటించిన మహాత్మ సినిమా కాగా, మరొక సినిమా రవి తేజ హీరోగా నటించిన దరువు.
ఇక దరువు సినిమాకు సంగీతం అందించడం మాత్రమే కాకుండా రెండు పాటలు కూడా పాడాడు.
దరువు సినిమాకు సంగీతం అందించింది చాలామంది ఇప్పటి వరకు థమన్ అని అనుకుంటున్నారు.
కానీ విజయ్ ఆంటోనీ తనదైన నైపుణ్యంతో పక్క భాషల్లో కూడా సంగీతం అందిస్తున్నాడు.
ఇక ఏడేళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయిన విజయ్ అనేక కష్టాలు పడి పైకి వచ్చాడు.
ఇక ప్రస్తుతం విజయ్ నాలుగు సినిమాల్లో నటిస్తున్నాడు.