విజయ్ ఆంటోని బిచ్చగాళ్ల కోసం అంత పని చేశారా..?

బిచ్చగాడు( Bichhagadu ) సినిమా రిలీజ్ అయిన అన్ని భాషలలో మంచి సక్సెస్ సాధించింది.

దానికి సిక్వల్ గా వచ్చిన సినిమానే బిచ్చగాడు 2.కోలీవుడ్ ఇండస్ట్రీలోని టాలెంటెడ్ హీరోలలో ఒకరైన విజయ్ ఆంటోని( Vijay Antony ) బిచ్చగాడు2 సినిమాతో మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు.

బిచ్చగాడు2 రిలీజ్ రోజున ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ టాక్ రావడంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావడం సులువు కాదని కామెంట్లు వినిపించాయి.

అయితే ఎవరూ ఊహించని విధంగా ఈ సినిమా అంచనాలను మించి సక్సెస్ సాధించడం గమనార్హం.

విజయ్ ఆంటోని తెలుగులో ఈ సినిమాకు ప్రమోషన్స్ చేస్తుండగా విజయ్ ఆంటోని భార్య తమిళంలో ఈ సినిమా ప్రమోషన్స్ చేస్తున్నారు.

మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తిరుపతికి వెళ్లిన విజయ్ ఆంటోని అక్కడ ఉన్న యాచకులతో ముచ్చటించారు.

వాళ్లతో కలిసి ఫోటోలు దిగడంతో పాటు వాళ్లకు కిట్లను సైతం అందజేశారు.తమిళనాడులో విజయ్ భార్య ఫాతిమా( Fatima ) బిచ్చగాళ్లకు దుస్తులు పంపిణీ చేయడంతో పాటు వాళ్ల కోసం స్పెషల్ షో వేయించారు.

బిచ్చగాడు2 మూవీ ఇప్పటివరకు అన్ని భాషల్లో కలిపి 25 కోట్ల రూపాయల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుందని సమాచారం అందుతోంది.

"""/" / బిచ్చగాడు2 మూవీ మరిన్ని రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

బిచ్చగాడు2 మూవీకి సీక్వెల్ గా భారీ బడ్జెట్ తో బిచ్చగాడు3 తెరకెక్కనుందని సమాచారం అందుతోంది.

విజయ్ ఆంటోని తన సినిమాల బడ్జెట్ విషయంలో రాజీ పడటం లేదు.బిచ్చగాడు3 విజయ్ ఆంటోనికి మరో సక్సెస్ ఇవ్వాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

బిచ్చగాడు3 సినిమా బాక్సాఫీస్( Box Office ) ను షేక్ చేయడంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

"""/" / గత సినిమాలు ఆశించిన ఫలితాన్ని అందుకోకపోవడంతో బిచ్చగాడు సీక్వెల్స్ పై విజయ్ ఆంటోని దృష్టి పెట్టారని కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తుండటం గమనార్హం.

బిచ్చగాడు2 సక్సెస్ తో విజయ్ ఆంటోని పారితోషికం సైతం పెరిగిందని తెలుస్తోంది.

క్యాన్సర్ తో పోరాడుతున్న చిన్నారిని ఆడించిన అడివి శేష్.. ఈ హీరో గ్రేట్ అంటూ?