బిచ్చగాడు సినిమాకు నోట్ల రద్దుకు లింక్.. ఎలానో తెలుసా?
TeluguStop.com
మన దేశంలో ఆర్బీఐ సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది.ముఖ్యంగా హఠాత్తుగా నోట్ల రద్దు చేసి ప్రజలకు షాక్ ఇస్తుంది.
గతంలో 500, 1000 నోట్లను రద్దు చేసి 2000 నోటును ప్రవేశ పెట్టిన దేశ ప్రభుత్వం.
ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకుంది.ఈసారి 2000 నోటును కూడా రద్దు చేస్తూ ప్రకటించి షాక్ ఇచ్చింది.
ఒక్కసారిగా ఈ నోట్ల రద్దుతో మరోసారి దేశంలో ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయో చూడాలి.
ఇది పక్కన పెడితే ఈ నోట్ల రద్దుకు బిచ్చగాడు సినిమాకు సంబంధం ఉంది అంటూ ఒక వార్త సోషల్ మీడియా( Social Media, )లో వైరల్ అవుతుంది.
ఇంతకీ బిచ్చగాడు సినిమాకు ఈ నోట్ల రద్దుకు మధ్య ఉన్న సంబంధం ఏంటి అంటే.
బిచ్చగాడు సినిమా అప్పట్లో ఎంత సెన్షనల్ హిట్ అయ్యిందో చెప్పాల్సిన అవసరం లేదు.
అప్పటి వరకు విజయ్ ఆంటోనీ( Vijay Antony ) ఎవరో కూడా తెలియక పోయిన బిచ్చగాడు సినిమాలోని కంటెంట్ కారణంగా మన తెలుగు ప్రేక్షకులు ఈ సినిమా ఆదరించారు.
"""/" /
ఇక ఇప్పుడు బిచ్చగాడు సినిమాకు సీక్వెల్ తెరకెక్కింది.నిన్న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.
తెలుగు, తమిళ్ లో ఒకే రోజు రిలీజ్ అవ్వగా ఇది కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
ఇక బిచ్చగాడు దీనికి సీక్వెల్ కూడా డబ్బు ప్రధానంగా చూపించారు.డబ్బు చుట్టూనే ఈ రెండు సినిమాల కథ తిరిగింది.
మరి బిచ్చగాడు వచినప్పుడు 500, 1000 నోట్లను దేశ ప్రభుత్వం రద్దు చేసింది.
"""/" /
ఇక ఇప్పుడు బిచ్చగాడు 2 ( Bichagadu 2 )సినిమా రిలీజ్ అయ్యాక 2000 నోట్లను రద్దు చేస్తూ ఆర్బీఐ ప్రకటన చేసింది.
దీంతో ఈ రెండు సినిమాలు వచ్చిన సమయంలోనే నోట్ల రద్దు విషయంలో కీలక ప్రకటనలు రావడం ఆశ్చర్యంగా ఆసక్తికరంగా మారాయి.
ఈ అంశం గురించి హాట్ టాపిక్ గా సోషల్ మీడియాలో చర్చ జరగడం విశేషం.
చిరంజీవితో సినిమా చేయాలంటే ఈ ఆస్థాన రచయితల సలహాలు కూడా తీసుకోవాల్సిందే…