‘లియో’ ఇంటర్వెల్ ను అలా ప్లాన్ చేసిన లోకేష్.. నెక్స్ట్ లెవల్ ఖాయం!

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ జోసెఫ్ ( Thalapathy Vijay )కు కోలీవుడ్ లో మాత్రమే కాదు మన తెలుగులో కూడా బాగానే ఫాలోయింగ్ ఉంది.

అందుకే తన సినిమాల కోసం ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తుంటారు.యావరేజ్ టాక్ వచ్చిన 200 కోట్లను కలెక్ట్ చేసే సత్తా ఉన్న స్టార్ విజయ్.

మరి అలాంటి హీరో సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ ముందు నుండే ఆ సినిమా కోసం ఎదురు చూస్తుంటారు.

"""/" / దళపతి విజయ్ ప్రస్తుతం సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో 'లియో' సినిమా ( LEO Movie )చేస్తున్నాడు.

భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా తమిళ్ ఇండస్ట్రీలో క్రేజీ ప్రాజెక్ట్ లలో ఒకటిగా తెరకెక్కుతుంది.

ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకోగా ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్, ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేసి ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసారు.

ఫస్ట్ సింగిల్ ఆకట్టుకోగా మళ్ళీ ఇటీవలే సంజయ్ దత్ పాత్ర గురించిన గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు.

ఈ ప్రమోషనల్ కంటెంట్ అందరిని ఆకట్టుకోవడమే కాకుండా సినిమాపై మరిన్ని అంచనాలు కూడా పెంచేసాయి.

ఇక ప్రస్తుతం మేకర్స్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు.ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి తాజాగా ఇంటర్వెల్ బ్లాక్ గురించి అదిరిపోయే అప్డేట్ బయటకు వచ్చింది.

G """/" / ఈ సినిమా ఇంటర్వెల్ బ్లాక్ 8 నుండి 9 నిమిషాల పాటు నాన్ స్టాప్ గా నెక్స్ట్ లెవల్లో ఉంటుందట.

లోకేష్ కు ఇంటర్వెల్ బ్యాంగ్స్ ఇవ్వడంలో స్పెషలిస్ట్ అనే మార్క్ ఉంది.మరి లియో లో ఏ రేంజ్ లో ఈ ఇంటర్వెల్ బ్లాక్ ఉందో చూడాలి.

ఇదిలా ఉండగా సెవన్ స్క్రీన్ స్టూడియో పై లలిత్ కుమార్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాలో త్రిష ( Trisha )హీరోయిన్ గా నటిస్తుండగా అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.

ఈ సినిమాను అక్టోబర్ 19న దసరా కానుకగా రిలీజ్ చేస్తున్నారు.

మూడేళ్ల క్రితమే పవన్ సీఎం అవుతారని చెప్పానన్న ఎస్జే సూర్య.. సగం మాత్రమే ప్రూవ్ అయిందంటూ?