విజయమ్మకు ఇంత షాక్‌ ఇచ్చారేంటి?

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిపై ఢిల్లీ పెద్దలు గుర్రుగా ఉన్నారన్న వార్తల నేపథ్యంలో.తాజాగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఓ చర్య చర్చనీయాంశం అయింది.

వైఎస్‌ కుటుంబం ఆధ్వర్యంలో నడుస్తోన్న విజయమ్మ చారిటబుల్‌ ట్రస్ట్‌ను కేంద్రం రద్దు చేసింది.

విదేశీ నిధుల నియంత్రణ చట్టం సెక్షన్‌ 14 ప్రకారం ఈ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది.

ఎఫ్‌సీఆర్‌ఏ నిబంధనలను ఈ ట్రస్ట్‌ ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఉన్నాయి.2017-18 ఏడాదికిగాను విదేశాల నుంచి వచ్చిన నిధులు, వాటి ఖర్చుల వివరాలను విజయమ్మ చారిటబుల్‌ ట్రస్ట్‌ ప్రభుత్వానికి ఇవ్వలేదు.

గతేడాదే ఈ వివరాలను ఇవ్వాల్సి ఉంది.అయితే ఈ ఏడాది మార్చి 31 వరకూ ఆ గడువును పొడిగించినా ఈ ట్రస్ట్‌ నుంచి ఎలాంటి స్పందనా రాలేదు.

"""/" /చివరికి జూన్‌ 22న మరో లేఖ కూడా రాసినట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది.

అయినా స్పందించకపోవడంతో ఇక ట్రస్ట్‌ను రద్దు చేయాలని నిర్ణయించినట్లు ఓ ప్రకటనలో తెలిపింది.

విజయమ్మ ట్రస్ట్‌ ఒక్కటే కాదు.అలాంటివి తెలంగాణలో 90, ఏపీలో 168 ట్రస్ట్‌లను కూడా రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది.

ఇందులో విజయమ్మ చారిటబుల్‌ ట్రస్ట్‌తోపాటు రాయపాటి చారిటబుల్‌ ట్రస్ట్‌, రూరల్‌ ఎడ్యుకేషన్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ, అరుణ మహిళా మండలిలాంటివి కూడా ఉన్నాయి.

అయితే ఈ ట్రస్టుల్లో 90 శాతం క్రిస్టియన్‌ మతానికి చెందినవి కావడం కొత్త చర్చకు దారి తీసింది.

విదేశాల నుంచి ఎక్కువ మొత్తంలో విరాళాలు వచ్చేవి వీటికే.దీంతో చారిటీ పేరుతో మతమార్పిళ్లు చేస్తున్న ట్రస్టులపై కేంద్రం కొరఢా ఝుళిపిస్తోందని సోషల్‌ మీడియా హోరెత్తిస్తోంది.

అందులోనూ ఏపీ సీఎం జగన్‌ తల్లికి చెందిన ట్రస్ట్‌ ఉండటంతో ఈ వార్తకు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.