కాళేశ్వరంపై విజిలెన్స్ అధికారుల తనిఖీలు..!!
TeluguStop.com
కాళేశ్వరంపై( Kaleswaram ) విజిలెన్స్ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి.గోదావరిఖని ఎన్టీపీసీలోని ఇరిగేషన్ ఎస్ఈ కార్యాలయంలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
సుందిళ్ల, మేడిగడ్డ, అన్నారం ప్రాజెక్టులతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరిగిన ప్రాజెక్టు నిర్మాణాల అవకతవకల నేపథ్యంలో అధికారులు పైళ్లను తనిఖీ చేస్తున్నారు.
"""/" /
అదనపు ఎస్పీ బాలకోటయ్య ఆధ్వర్యంలో ఎనిమిది మంది అధికారుల బృందం( Vigilance Officials ) తనిఖీలు చేస్తుంది.
అయితే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీగా అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం ముమ్మరంగా దర్యాప్తు చేయిస్తున్న సంగతి తెలిసిందే.
మహా కుంభమేళా 2025 : ఎన్ఆర్ఐల కోసం యోగి సర్కార్ ప్రత్యేక ఏర్పాట్లు