తెలంగాణ ఎక్సైజ్ శాఖపై విజిలెన్స్ దర్యాప్తు..!

తెలంగాణ ఎక్సైజ్ శాఖపై విజిలెన్స్ ( Telangana Excise Department ) దర్యాప్తు చేపట్టింది.

ఎక్సైజ్ శాఖలో పని చేస్తున్న కొందరు అధికారులపై ఫిర్యాదులు అందడంతో తెలంగాణ ప్రభుత్వం స్పందించింది.

ఈ మేరకు శాఖపై విచారణకు కీలక ఆదేశాలు జారీ చేసింది.2017 నుంచి 2022 వరకు ఎక్సైజ్ శాఖలో భారీగా అవినీతి జరిగినట్లుగా ప్రభుత్వం గుర్తించింది.

కొందరు అధికారుల పెత్తనం చెలాయిస్తూ ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టారని రాష్ట్ర సర్కార్ కు ఫిర్యాదులు వచ్చిన సంగతి తెలిసిందే.

ప్రభుత్వ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన విజిలెన్స్ దర్యాప్తును ముమ్మరంగా కొనసాగిస్తుంది.ఇందులో భాగంగా ఓ ఐఏఎస్ అధికారి పాత్రపై ఆరా తీసిన విజిలెన్స్ సదరు అధికారి 15 ఎకరాలు గిఫ్ట్ గా తీసుకున్నట్లు గుర్తించింది.

అదేవిధంగా సుమారు పదిహేను మంది అధికారులు అవినీతి చిట్టా సిద్ధం చేసింది.

వచ్చే జన్మలో ప్రభాస్ లాంటి కొడుకు పుట్టాలి.. ప్రముఖ నటి క్రేజీ కామెంట్స్ వైరల్!