బన్నీ అద్భుతం అంటున్న టాలీవుడ్ స్టైలిష్ విలన్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా టాలీవుడ్ లో తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు.

ప్రతి సినిమాకి తనని తాను కొత్తగా ప్రెజంట్ చేసుకుంటూ ప్రేక్షకులకి కొత్తదనం అందిస్తున్నాడు.

అలాగే సినిమాలలో కమర్షియల్ కథలనే ఎంచుకుంటున్న ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా కథలు ఒకే చేస్తూ తన ప్రస్తానం సాగిస్తున్నాడు.

ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాని సెట్స్ పైకి తీసుకొని వెళ్తున్నాడు.ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్తుంది.ఇక ఇందులో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది.

ఇదిలా ఉంటే అల్లు అర్జున్ ఫ్యాన్ ఫాలోయంగ్ కేవలం తెలుగుకి మాత్రమే పరిమితం కాలేదు.

అన్ని భాషలలో అతనికి విశేషంగా ఫ్యాన్స్ ఉన్నారు.అందుకే అతని సినిమాలకి హిందీ డబ్బింగ్ లో కూడా విశేషమైన ఆదరణ ఉంటుంది.

ఇక సెలబ్రెటీలలో కూడా బన్నీని అభిమానించేవారు ఉంటారు.అతని డాన్స్, స్టైల్ కి చాలా మంది ఫిదా అయిపోతూ ఉంటారు.

గతంలో హృతిక్ రోషన్ కూడా బన్నీ డాన్స్ టాలెంట్ మీద ప్రశంసలు కురిపించారు.

తాజా గా మరో బాలీవుడ్ హీరో టాలీవుడ్ లో స్టైలిష్ విలన్ గా పలు సినిమాలలో మెప్పించిన విద్యుత్ జమ్వాల్ కూడా బన్నీపై ప్రశంసలు కురిపించాడు.

టాలీవుడ్ లో తనకి బాగా ఇష్టమైన హీరో అల్లు అర్జున్ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

అతనొక అద్భుతమైన వ్యక్తి అని, అతనికి అన్నిచోట్ల అభిమానులు ఉన్నారని అన్నారు.అతనో అద్భుతమైన నటుడు అని పొగిడేశారు.

మొత్తానికి అతని ప్రశంసలు చూస్తూ ఉంటే బాలీవుడ్ సెలబ్రెటీలలో సైతం చాలా మంది బన్నీ అభిమానులు ఉన్నారని అర్ధమవుతుంది.

ఆర్య మూవీ లో ఈ షాట్ కోసం అల్లు అర్జున్ చేసిన పని తెలిస్తే ..?