బేబమ్మలా ఉన్న ఈ నటి ఎవరో మీకు తెలుసా..?

మనుషులను పోలిన మనుషులు ఉంటారని మనం తరచూ వింటూ ఉంటాం.అయితే సెలబ్రిటీలను పోలి ఉండే సెలబ్రిటీల ఫోటోలు మాత్రం నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి.

ఉప్పెన సినిమాలో కృతిశెట్టి హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే.ఆ సినిమాలో అద్భుతంగా నటించి కృతిశెట్టి అభిమానులను సొంతం చేసుకున్నారు.

అయితే కృతిశెట్టిని పోలి ఉన్న ఒక నటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆ నటి ఫోటోను చూసి కృతిశెట్టి ఫ్యాన్స్ లో కొంతమంది ఆమె కృతి సిస్టర్ అని అనుకుంటున్నారు.

కృతిశెట్టిని పోలి ఉన్న ఈ నటి పేరు విద్యా విను మోహన్ కాగా ఈ నటి కేరళ రాష్ట్రంలోని కొట్టాయంలో విద్యను అభ్యసించారు.

ఈ నటి మనకు పెద్దగా పరిచయం లేకపోయినా వల్లి అనే సీరియల్ ద్వారా ఇతర రాష్ట్రాల ప్రేక్షకుల్లో మాత్రం బాగానే గుర్తింపు తెచ్చుకున్నారు.

ప్రస్తుతం ఈ నటి అభియుమ్ నానుమ్ అనే సీరియల్ లో నటిస్తున్నారు. """/"/ విద్యా విను సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటూ తన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు.

అయితే ఈ నటిలో ఇస్మార్ట్ శంకర్ సినిమాతో గుర్తింపు సంపాదించుకున్న నిధి పోలికలు కూడా ఉండటం గమనార్హం.

సీరియల్స్ ద్వారా గుర్తింపును సంపాదించుకున్న విద్యా విను భవిష్యత్తులో సినిమాల ద్వారా కూడా నటిగా విజయాలను సొంతం చేసుకుంటారేమో చూడాల్సి ఉంది.

మరోవైపు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల కొరత ఎక్కువగా ఉంది.అందం, అభినయం పుష్కలంగా ఉన్న హీరోయిన్లకు సినిమా రంగంలో బాగానే ఆఫర్లు వస్తున్నాయి.

కృతిశెట్టిలా విద్యా విను భవిష్యత్తులో స్టార్ హీరోయిన్ గా గుర్తింపును సంపాదించుకుంటారేమో చూడాల్సి ఉంది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో విద్యా విను ఫోటోలు తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.

నెలకు 2 సార్లు ఈ ప్రోటీన్ మాస్క్ ను వేసుకుంటే మీ జుట్టు రాలమన్న రాలదు!