ఇందిరాగాంధీ పాత్రలో విద్యా బాలన్… భర్తే నిర్మాతగా

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యా బాలన్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకుంది.

లేడీ ఒరియాంటెడ్ కథలకి కేరాఫ్ అడ్రెస్ గా విద్యా బాలన్ మారింది.మరీ ముఖ్యంగా బయోపిక్ కథలు అంటే విద్యా ముందు వరుసలో ఉంటుంది.

అందుకు తగ్గట్లుగానే ఆమె నటించే ప్రతి బయోపిక్ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంటుంది.

రెగ్యులర్ సినిమాలని పూర్తిగా పక్కన పెట్టిన విద్యా బాలన్ తన మనసుకి నచ్చే చిత్రాలు మాత్రమే చేస్తుంది.

పెళ్లి తర్వాత సినిమాల పరంగా మరింతా బాద్యాతాయుతంగా వ్యవహరిస్తుంది.బయట ఎంత సంప్రదాయంగా ఉంటుందో సినిమాలు కూడా అంతే క్లాసిక్ కథలని విద్యా ఎంపిక చేసుకుంటుంది.

తాజాగా ఈమె ఇండియన్ గణిత శాస్త్రవేత్త శకుంతలదేవి జీవిత కథతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకొని దూసుకుపోతుంది.ఇదిలా ఉంటే ఇప్పుడు విద్యా బాలన్ దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ లైఫ్ స్టొరీ మీద ఫోకస్ పెట్టింది.

ఇందిరా గాంధీ పాత్రలో కనిపించడానికి రెడీ అవుతుంది.ఇండియన్ ఐరన్ లేడీగా దేశ రాజకీయాలలో తనదైన ముద్ర వేసిన ఇందిరా జీవితంలో కూడా కీలక సంఘటనలు ఉన్నాయి.

సిక్కుల ఊచకోత, గోల్డెన్ టెంపుల్ ఘటన, దేశంలో అత్యవసర పరిస్థితులు, ఆమె హత్య వంటివి సినిమాలో ప్రధాన అంశాలుగా ఉంటే కచ్చితంగా ఈ స్టొరీ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది అనడంలో ఎలాంటి సదేహం లేదు.

ఇక ఇందిరాగాంధీ బయోపిక్ ని విద్యా బాలన్ భర్త సిద్ధార్థ్ రాయ్ కపూర్ నిర్మించబోతున్నాడు.

అయితే ఇప్పుడు షూటింగ్స్ స్టార్ట్ చేసే పరిస్థితులు కనిపించడం లేదు కాబట్టి, ఈ బయోపిక్ ని కొన్నాళ్లు పోస్ట్ పోన్ చేస్తున్నారని సమాచారం.

త్వరలోనే తెలంగాణ క్యాబినెట్ విస్తరణ… రేసులో ఉంది వీరే ?