వీడియో వైరల్.. ఫన్నీ టమాటా రైమ్‭తో అదరగొట్టిన టీచర్లు!

ప్రస్తుతం విద్యా బోధనలో ఎన్నో రకాల మార్పులు వచ్చాయి.ఇదివరకు కేవలం ఉపాధ్యాయులు చెప్పిన వాటిని విద్యార్థులు తూచా తప్పకుండా విని వాటిని చదువుకొని పరీక్షలు వ్రాసేవారు.

అయితే, ప్రస్తుతం ఉన్న చదువులలో ఇది ఏమాత్రం కనిపించడం లేదు.విద్యార్థికి పాఠాలు చెప్పేందుకు టీచర్లు( Teachers ) కొత్త పద్ధతులను ఎంచుకుంటున్నారు.

ఎలా చెబితే విద్యార్థికి ఎక్కువ కాలం గుర్తుంటుంది అని ఆలోచన చేసి మరి కొత్త కొత్త మార్గాలలో పాఠాలను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు.

ఇకపోతే తాజాగా కొందరు టీచర్లకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే. """/" / పిల్లలకు రైమ్స్( Rhymes For Children ) నేర్పించడానికి టీచర్లు పడే శ్రమ అంతా ఇంత కాదు.

పిల్లలకి చక్కగా ఆటల రూపంలో లేదా పాటలు రూపంలో చెబితేనే వారికి అర్థమవుతుంది.

అందుకోసం ఎప్పటికప్పుడు టీచర్లు వారి ఆలోచనలను పదును పెడుతూ ట్రైనింగ్ తీసుకుంటున్నారు.పిల్లలకి ఎలా చెబితే మనసుల్లోకి ఎక్కుతుందో ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుని మరి పిల్లలకు బోధిస్తుంటారు.

ప్రస్తుతం వైరల్ అయిన వీడియోలో ఒక క్లాస్ రూమ్ లో చిత్రీకరించినట్లుగా కనబడుతుంది.

ఈ వీడియోలో " ఆహా టమాటా బడే ఫంగి " ( Aha Tamata Bade Fungi )అనే రైమ్ ను చెబుతూ దానికి అనుగుణంగా టీచర్లు డాన్స్ వేయడం కనపడుతుంది.

వారందరికీ మరో ఇద్దరు శిక్షణ ఇస్తున్నట్లుగా వీడియోలో కనబడుతుంది.ఈ వీడియోలో టీచర్లు ఎంతో చక్కగా రైమ్ ను ఆలపించడం మనం చూడవచ్చు.

"""/" / ఇక ఈ వీడియోని చూసిన సోషల్ మీడియా వినియోగదారులు రకరకాలుగా స్పందిస్తున్నారు.

కొందరేమో టీచర్లు పడే శ్రమను, నిబద్ధతలను కొనియాడుగుతుండగా.మరికొందరేమో.

, మన కాలంలో ఇటువంటి ఉపాధ్యాయులు ఎందుకు లేరు అంటూ బాధపడుతున్నారు.ఇంకెందుకు ఆలస్యం.

మీరు కూడా ఈ వైరల్ వీడియోని ఓసారి వీక్షించి మీకు ఏమనిపించిందో ఓ కామెంట్ చేయండి.

సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న మాస్ మహారాజ్ కూతురు.. సులువుగా క్లిక్ అవుతారా?