New York : వీడియో: చెత్తగా ఉన్న ఈ అపార్ట్‌మెంట్ రెంట్‌ అక్షరాలా రూ.2 లక్షలట..!!

న్యూయార్క్( New York ) నగరంలో తక్కువ ధరల్లో ఇల్లు దొరకడం దాదాపు అసాధ్యమని చెప్పుకోవచ్చు.

ఇక్కడ ఇల్లు అపార్ట్మెంట్స్ రేట్లు భారీగా పెరిగిపోతున్నాయి.దీనివల్ల ఈ రోజుల్లో తల దాచుకోవడానికి చిన్న ఇల్లు కావాలన్నా నెలకే లక్షల్లో రెంట్‌ ఇచ్చుకోవాల్సి వస్తోంది.

ఒకప్పుడు రీజనబుల్ ప్రైస్‌ల్లో ఉన్న గృహాలు ఇప్పుడు దిమ్మతిరిగే రేట్లు పలుకుతున్నాయి.ఇక్కడ చెత్తగా కనిపించే ఎన్నో ధరలు ఎంత ఎక్కువగా ఉన్నాయో చూడండి అంటూ చాలామంది వీడియోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

"""/" / ఇటీవల, మాన్‌హట్టన్‌( Manhattan )లోని నోలిటా పరిసరాల్లోని ఒక చిన్న స్టూడియో అపార్ట్‌మెంట్‌ను చూపించే వీడియో వైరల్‌గా మారింది.

ఈ అపార్ట్‌మెంట్ అద్దెకు నెలకు దాదాపు రూ.2 లక్షలట.

అంటే అందులో ఉండాలంటే నెలకు ఎంత సంపాదించాలో అర్థం చేసుకోండి.డేవిడ్ ఒకోచా( David Okocha ) అనే రియల్ ఎస్టేట్ ఏజెంట్ పోస్ట్ చేసిన ఈ వీడియో ఆన్‌లైన్‌లో త్వరగా పాపులర్ అయ్యింది, న్యూయార్క్‌లో హై లివింగ్ కాస్ట్ గురించి చర్చలకు దారితీసింది.

ధరకు తగినట్లు ఈ అపార్ట్‌మెంట్‌లో ఒక్క లగ్జరీ లక్షణం కూడా లేదు.ఇది చిన్నదిగా ఉంది, వరస్ట్ డిజైన్‌తో కనిపించింది.

ఇలాంటి స్థలం కోసం అధిక అద్దె వసూలు చేయడం గురించి తెలుసుకొని నెటిజన్లు ఆశ్చర్యపోయారు.

"""/" / ఈ వీడియోను 3.1 మిలియన్లకు పైగా వీక్షించారు.

అందులో, అపార్ట్‌మెంట్‌లో చాలా చిన్న గది ఉన్నట్లు మనం చూడవచ్చు.ఇది ప్రధాన నివాస స్థలంగా పనిచేస్తుంది.

అలానే షవర్ వంటగదికి చాలా దగ్గరగా ఉంది, దానిని సన్నని ప్లాస్టిక్ షీట్‌తో మాత్రమే వేరు చేశారు.

ఇక టాయిలెట్‌లో చేతులు కడుక్కోవడానికి సింక్ కూడా లేదు.టాయిలెట్ సైజు చాలా ఇరుకుగా ఉంది.

అదే స్థలంలో వాషింగ్ మెషీన్‌ కూడా పెట్టుకోవాల్సిన దుస్థితి.ఒక స్మాల్ న్యూయార్క్ అపార్ట్‌మెంట్ ప్రజల దృష్టిని ఆకర్షించడం ఇదే మొదటిసారి కాదు.

మరో రియల్ ఎస్టేట్ ఏజెంట్, ఒమర్ లాబాక్, నగరంలోని అతిచిన్న అపార్ట్‌మెంట్ అని పిలిచే వీడియోను షేర్ చేశాడు.

ఈ చిన్న స్థలానికి అద్దె నెలకు $1,200, ఇది దాదాపు రూ.99,482కి సమానం.

ఈ ధరలు చూసి చాలామంది షాక్ అవుతున్నారు.ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.

గేమ్ ఛేంజర్ లీక్ వెనుక ఉన్నది వాళ్లేనా.. అడిగిన డబ్బు ఇవ్వలేదనే అలా చేశారా?