వీడియో: అల్లంత ఎత్తు నుంచి కుప్పకూలిన ప్లేన్.. అయినా పైలట్ బతికాడు..!

అదృష్టం ఉంటే ఎంత పెద్ద ప్రమాదం నుంచి అయినా బతికి బట్టకట్టవచ్చు.ఇలాంటి అదృష్టవంతులకు సంబంధించిన వీడియోలు ఎన్నో నెట్టింటలో వైరల్ అయ్యాయి.

తాజాగా మరొక అదృష్టవంతుడి వీడియో వైరల్ గా మారింది.ఈ వీడియోలో ఒక వ్యక్తి ఒక చిన్న విమానంలో లేదా హెలికాప్టర్ లో విహంగ విహారం చేస్తున్నాడు.

అయితే ఆ ఫ్లైట్ ఇంజన్ ఫెయిల్ కావడంతో అది కిందకు పడిపోవడం ప్రారంభించింది.

దీంతో ఒక పారాచూట్ ఆన్ చేశారు.ఆ పారాచూట్ అనేది హెలికాప్టర్ కుప్పకూలే క్రమాన్ని నెమ్మదించింది.

దాంతో ఆ విమానం కింద పడినా పేలలేదు.అందులో ఉన్న ఫైలట్‌కి పెద్దగా గాయాల ఏం కాలేదు.

అతడు స్వల్పగాయాలతో బయటపడి మెల్లగా నడుచుకుంటూ వెళ్లిపోయాడు.ఈ దృశ్యాలను స్థానికులు తమ కెమెరాలో బంధించారు.

వైరల్‌ హాగ్ షేర్ చేసిన వీడియో లక్షకు పైచిలుకు వ్యూస్, 5 వేల వరకు లైకులు వచ్చాయి.

"""/" / "మిరాకిల్ అంటే ఇదే.అంత ఎత్తు నుంచి ప్లేన్ కిందపడినా అందులోని పైలట్ బతికే ఉన్నాడు.

" అని దీనికి ఇన్‌స్టాగ్రామ్ పేజీ ఒక క్యాప్షన్ జోడించింది.ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

"ఇదేదో బొమ్మ విమానం అనుకున్నా.కానీ ఇది నిజమైన విమానం అని తెలిసి నేను ఆశ్చర్య పడ్డా" అని ఒక యూజర్ కామెంట్ పెట్టాడు.

ఇలాంటి చిన్న విమానాలుకి ప్యారాచూట్ సేఫ్టీ ఉండటం తప్పనిసరి.చూశారుగా ఇది ఎలా కాపాడుతుందో అని ఒక కామెంట్ చేశాడు.

ఇలాంటి దృశ్యం నా జీవితంలో చూడలేదని ఎప్పుడూ చూడలేదని అబ్బురపడ్డారు.

ఏంటి జూనియర్ ఎన్టీఆర్ చేజేతులా ఇంత పెద్ద నష్టం తనకు తానే చేసుకున్నారా ?