వీడియో: బార్బర్ షాప్‌కి వెళ్లి హెయిర్ కటింగ్ చేయించుకున్న కుక్క.. అవాక్కవుతున్న నెటిజన్లు..!

సోషల్ మీడియాలో వైరలయ్యే డాగ్ వీడియోలు ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమందిని అలరిస్తుంటాయి.ప్రపంచంలో ఏ మూల ఉన్న వారైనా సరే ఈ వీడియోలకు కనెక్ట్ అవుతారు అంటే అతిశయోక్తి కాదు.

చిన్న పెద్ద అనే భేదం లేకుండా ఈ వీడియోలను నెటిజన్లు ఇష్టపడుతుంటారు.అయితే కుక్కలు ఒక్కోసారి చేసే కొన్ని క్యూట్ పనులు, వాటికి సంబంధించిన వీడియోలు మరింతగా ఆకట్టుకుంటాయి.

తాజాగా అలా ఆకట్టుకునే ఒక క్యూట్ డాగ్ వీడియో వైరల్‌గా మారింది.ఈ వీడియోలో ఒక కుక్క బార్బర్ షాప్‌కి వెళ్లి కటింగ్ చేయించుకుంది.

హెయిర్ కటింగ్ చేసేటప్పుడు ఈ కుక్క చాలా ఎంజాయ్ చేస్తూ కనిపించింది.వైరల్ అవుతున్న వీడియోలో ఒక కటింగ్ షాప్ లో కుక్క కూర్చొని ఉండటం చూడవచ్చు.

దీని తలకు తప్ప మిగతా బాడీకి ఒక వస్త్రం చుట్టారు.ఎందుకంటే కటింగ్ చేసేటప్పుడు హెయిర్ దీని శరీర భాగాలపై పడకుండా.

మనుషులకు ఎలా కటింగ్ చేస్తారో సేమ్ అలానే ఈ కుక్క కూడా బార్బర్ హెయిర్ కటింగ్ చేశాడు.

ఈ సమయంలో కుక్క చాలా సహనంగా కూర్చొని ఎంచక్కా కటింగ్ చేయించుకుంది.కాకపోతే అక్కడ ఉన్న ఉష్ణోగ్రత వల్ల అది కాస్త రొప్పుతూ కనిపించింది.

అంతకుమించి అది పడిన పెద్ద ఇబ్బంది ఏం లేదు. """/" / దీనికి సంబంధించిన వీడియోని @PAVDOG అనే ట్విట్టర్ పేజీ షేర్ చేసింది.

దీనికి ఇప్పటికే 34 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.దీన్ని చూసి నెటిజన్లు నవ్వుకుంటున్నారు.

మరికొందరు కుక్క హాయిగా హెయిర్ కట్ చేయించుకోవడం చూసి ఆశ్చర్యపోతున్నారు.ఏ కుక్క కూడా ఇంత ప్రశాంతంగా కూర్చోదు.

ఈ కుక్క మామూలుగా కాదు అని కామెంట్స్‌ చేస్తున్నారు.ఈ క్యూట్ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.

టాలీవుడ్ ఇండస్ట్రీలో చరిత్రలో లేని విధంగా భారీ ఫ్యాన్ వార్స్..?