ఆసుపత్రి క్యాంటీన్‌‌కు వెళ్లి షాక్ తిన్నాడు.. అక్కడ ఏమైందంటే!

మనం తినే ఆహారంలో ఒక తల వెంట్రుక వచ్చినా, చిన్న రాయి ఉన్నా తట్టుకోలేం.

కుటుంబ సభ్యుల మీద అరుస్తాం.అయితే బయట రెస్టారెంట్లలో ఆహారం ఎలా తయారు చేస్తారో అందరికీ తెలిసిందే.

కొందరు పరిశుభ్రత పాటించినా, చాలా మంది అపరిశుభ్ర వాతావరణంలో ఆహారాన్ని తయారు చేస్తుంటారు.

ఆ తర్వాత ఆహారంపై( Food ) మూతలు వేయకుండా నిర్లక్ష్యం ప్రదర్శిస్తుంటారు.ఇలాంటివి చూసినప్పుడు అప్పటి వరకు ఉన్న ఆకలి ఎగిరి పోతుంది.

ఓ పూట ఆకలిగా అయినా ఉండొచ్చు కానీ అలాంటి ఫుడ్ తినలేమని భావిస్తారు.

తాజాగా ఇలాంటి అనుభవం ఓ వ్యక్తికి ఎదురైంది. """/" / ఆసుపత్రిలో ఉన్న తమ కుటుంబ సభ్యుల కోసం వెళ్లిన ఆ వ్యక్తికి ఆకలి వేసింది.

దీంతో ఏదైనా తిందామని ఆసుపత్రి క్యాంటీన్‌కు( Hospital Canteen ) వెళ్లాడు.అక్కడి దృశ్యం చూసి అతడికి కడుపు రగిలి పోయింది.

అక్కడున్న దృశ్యాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు.దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలు కాస్త తక్కువగా ఉంటాయి.నిత్యం వేల సంఖ్యలో రోగులు ( Patients ) పెద్ద స్థాయి ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తుంటారు.

చెన్నైలోని ప్రభుత్వ ఆసుపత్రి నిత్యం రద్దీగా ఉంటుంది.స్టాన్లీ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిట్‌లో( Stanley Medical College And Hospital ) తాజాగా షాకింగ్ ఘటన జరిగింది.

"""/" / ఓ పేషెంట్ బంధువు ఏదైనా తినాలని భావించి క్యాంటీన్‌కి వెళ్లాడు.

అక్కడ ఫుడ్ ట్రేలో సమోసాలు, మసాలా వడలు, బోండాలు ఉన్నాయి.పరిశీలించి చూడగా వాటిని కొన్ని ఎలుకలు( Rats ) తింటున్నాయి.

దీంతో ఆ వ్యక్తి షాక్ తిన్నాడు.ఎంతో మంది తినే ఆహారంపై ఇలా ఎలుకలు ఉండడాన్ని ఆయన సహించలేకపోయాడు.

క్యాంటీన్ సిబ్బందిని ఈ విషయంలో నిలదీశాడు.ఆహారంలో ఎలుకలు తిరుగున్న దృశ్యాలను వీడియో తీసి ట్విట్టర్‌లో పెట్టాడు.

ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.క్యాంటీన్ సిబ్బంది నిర్లక్ష్యంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

శిరీష్ భరద్వాజ్ మరణం పై తల్లి షాకింగ్ కామెంట్స్.. ఆయన మరణానికి అదే కారణమా?