వీడియో: యూఎస్‌లో షాకింగ్ ఘటన.. ఫిమేల్ టీచర్‌ను కొట్టిన స్టూడెంట్..

విద్యార్థులు టీచర్లను తిట్టడం, కొట్టడం వంటి సంఘటనలు ఈరోజుల్లో కామన్ అయిపోయాయి.ముఖ్యంగా విదేశాల్లో విద్యార్థులు చాలా హింసాత్మకంగా మారుతున్నారు.

ఇటీవల అమెరికాలోని నార్త్ కరోలినాలో ఉన్న పార్క్‌ల్యాండ్ హైస్కూల్‌లో( Parkland High School ) ఓ షాకింగ్ సంఘటన జరిగింది.

ఈ సంఘటనకు సంబంధించి వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ఇబ్బందికరమైన వీడియో వ్యాప్తి చెందడంతో ఒక మగ విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు.

ఫిమేల్ టీచర్‌పై ( Female Teacher )విద్యార్థి భౌతిక దాడి చేయడం వీడియోలో కనిపించింది.

విద్యార్థి హింసాత్మక ప్రవర్తనతో రెచ్చిపోయినా, టీచర్‌ ప్రశాంతంగా ఉండి, పరిస్థితిని చాలా సెల్ఫ్ కంట్రోల్‌తో డీల్ చేసింది.

విద్యార్థి టీచర్‌ను కొట్టినట్లు వీడియోలో మనం చూడవచ్చు.అయితే టీచర్ దూకుడుగా స్పందించకుండా, కంపోజ్‌గా ఉండగలిగింది.

విద్యార్థి బలంగా చెంపలు వాయించినా ఆమె భయం, బాధ, కోపం వంటి నెగటివ్ ఎమోషన్స్‌ వ్యక్తపరచలేదు.

వృత్తి నైపుణ్యంతో పరిస్థితిని నిర్వహించింది.విద్యార్థి మరింత హింసాత్మకంగా బెదిరిస్తున్నట్లు కనిపించింది, కానీ ఉపాధ్యాయురాలు నిలకడగా ఉంటూ ఇకపై దాడిని స్వాగతించలేదని సూచిస్తుంది.

"""/" / ఈ సంఘటన విద్యార్థుల ప్రవర్తన, పాఠశాలల్లో ఉపాధ్యాయుల భద్రత గురించి చర్చలకు దారితీసింది.

విద్యా సంస్థలలో మెరుగైన భద్రతా చర్యలు, అటువంటి సవాళ్లను ఎదుర్కొనే ఉపాధ్యాయులకు మరింత మద్దతు అవసరం అని గుర్తు చేస్తుంది.

ఒత్తిడిలో ప్రశాంతంగా ఉండగలిగిన ఫిమేల్ టీచర్‌ను నెటిజన్లు ప్రశంసించారు.పాఠశాల వాతావరణంలో ( School Environment) విద్యార్థులకు గౌరవం, సరైన ప్రవర్తనను బోధించాలని కోరారు.

"""/" / పాఠశాలలో జరిగిన ఈ సంఘటన తరువాత, పాఠశాల నిర్వాహకులు, స్థానిక అధికారులు ఇలాంటివి మళ్లీ జరగకుండా ఉండేలా నిబంధనలను మార్చడానికి ఆలోచిస్తున్నారు.

భవిష్యత్తులో విద్యార్థులు, ఉపాధ్యాయులకు మరింత సురక్షితమైన, గౌరవప్రదమైన వాతావరణం ఉండేలా చూడటానికి వారు కమ్యూనిటీతో కలిసి మాట్లాడతారు.

వైరల్ వీడియో: పోలీసు స్టేషన్‌లోనే మహిళతో రాసలీలలు చేసిన పోలీస్ అధికారి